9 నెలల చిన్నారి శ్రీహితపై ప్రవీణ్ అనే యువకుడు జూన్ 19, 2019 అర్ధరాత్రి అత్యాచారం జరిపి, దారుణంగా హత్యచేశాడు. ముద్దాయి ప్రవీణ్ కి వరంగల్ కోర్టు గురువారం 8/8/2019 న ఉరిశిక్ష ను ఖరారు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది . వరంగల్ కోర్టు ఇచ్చిన తీర్పుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఏమి తెలియని పసిపాపని అంత క్రూరంగా అత్యాచారం జరిపి, హత్య చేసినవాడికి మరణ శిక్షే సరియైనది.
జగన్, రచన దంపతులకు వివాహమయిన 5 సంవత్సరాలకు శ్రీహిత జన్మించింది. జగన్ , రచన హైదరాబాద్ లోని , కూకట్ పల్లి లో నివసిస్తున్నారు. జగన్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. పెళ్ళైన 5 ఏళ్లకు పుట్టింది కాబట్టి, పాపని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు జగన్, రచనలు. జూన్ లో పాపకు 9 నెలలు నిండడంతో పుట్టిన వెంట్రుకలు తీయించడానికి వేములవాడ వెళ్లారు. ఆ తర్వాత రచన పుట్టిల్లు ( హన్మకొండ ) కి వెళ్లారు.
 |
9 month old baby rape case, Sri Hitha |
జూన్ 19, 2019:
అందరూ రాత్రి చాలాసేపు మాటలు చెప్పుకుని , ఇంట్లో ఉక్కగా ఉందని అందరూ డాబాపైన నిద్రపోయారు. హంతకుడు ప్రవీణ్ అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు , శ్రీహితను ఎత్తుకెళ్ళి అత్యాచారం జరిపి, హత్య చేసాడు. ప్రవీణ్ తీసుకెళ్లిన కొద్దిసేపటికే పాప లేదని గమనించిన తల్లిదండ్రులు, బంధువులు పాపకోసం ఇంట్లో చుట్టుపక్కల అంతా వెతికారు. పోలీసులకు అప్పటికప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. పాప మేనమామ ప్రవీణ్ దగ్గర పాపవుండటం చూసాడు. వాడిని పట్టుకోవడానికి వెళితే పాపని విసిరేసాడు. పాప మేనమామ పాపను కాపాడాలని వాడిని వదిలిపెట్టి, పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ పాప అప్పటికే చనిపోయింది.
 |
9 month old baby rape case, Sri Hitha images |
|
శ్రీహిత మేనమామ చెప్పిన విషయాలు :
పాప కనపడకపోయేసరికి , పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చారు. ఇంటి చుట్టుపక్కల, వెతికిన చోటే, పదే పదే వెతికారని, ఏమైనా అంటే పొద్దున వెతుకుదాం అన్నారని, పాపని ఎత్తుకెళ్లిన వాళ్ళు అంతసేపు అక్కడే ఎందుకు ఉంటారని ఆవేదన వ్యక్తం చేసాడు. పోలీసుకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా, ఇంకా కొంచెం దూరం వెతికివుంటే పాప దొరికేదని అన్నాడు. ఎందుకంటే తాను వెతుకుతున్నప్పుడు ఇంటికి కొంత దూరంలో ప్రవీణ్ కనిపించాడని , తనని చూడగానే పాపని విసిరేశాడన్నాడు. వాడిని పట్టుకుని రెండు దెబ్బలు కొట్టానని, ఆలోపు పాపని తీసుకోమని రోడ్డుమీద వెళుతున్నవారిని అడిగానని కానీ ఎవరు స్పందించలేదని వాపోయాడు. వాడిని ఎప్పుడైనా పట్టుకోవచ్చని , కానీ ముందు పాప ప్రాణాలను కాపాడుకోవాలని వాడిని వదిలేసి, పోలీసుల సహాయంతో హాస్పిటల్ కి తీసుకువెళ్తే, అప్పటికే పాప మృతిచెందిదని తెలిపాడు. అయితే పాప కాళ్లు , చేతులు సాగిపోవడంతో , 9 నెలల పాపలాగా అనిపించలేదని ఆవేదన వ్యక్తం చేసాడు.
 |
9 month old baby rape case, Sri Hitha Parents |
ఈ సంఘటన అనంతరం ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ పాప అమ్మమ్మ వాళ్ళ ఇంటిదగ్గర అనుమానాస్పదంగా ఉండటం గమనించారు. అందరూ నిద్రపోయాక పాపని ఎత్తుకుపోవడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని , పాప తల్లిదండులు, బంధువులు, తెలుగు ప్రజలు డిమాండ్ చేశారు. చివరికి ఆ నీచుడుకి 8/8/2019 న వరంగల్ కోర్టు ఉరిశిక్షను విధించింది.
 |
9 month old baby rape case, praveen images |
వరంగల్ కోర్టు తీర్పు :
నిందితుడిని అదుపులో తీనుకున్న పోలీసులు విచారించారు. 366,302, 376A , 376AB , 379 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వీటితో పాటు 5 (M ) రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు 30 కి పైగాసాక్షులను విచారించింది..40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి ప్రవీణ్ ని నిందితుడిగా నిర్ధారించి, ఉరిశిక్షను ఖరారు చేసింది. వరంగల్ కోర్టు ఇచ్చిన తీర్పుకు శ్రీహిత తల్లిదండ్రులు, బంధువులు, తెలుగు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నపిల్లలపై అత్యాచారం జరిపే ప్రతి ఒక్కడికి ఇది ఒక గుణపాఠం అవ్వాలని, ఇకనైనా దేశంలో అత్యాచారాలు జరగకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Post a Comment