sr NTR famous dialogue lirycs in telugu

ఆగాగు..........ఆచార్య దేవ!!
హహ్హహ్హ  ఏమంటివి? ఏమంటివి ?
జాతి నెపమున సూత సుతునకిందు
నిలువ అర్హత లేదందువా ....!
ఎంత మాట ఎంత మాట !!
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే !!
కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ??
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ??
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ??
మట్టి కుండలో పుట్టితివికదా !!
హహ్హహ్హ  నీది ఏ కులము??
ఇంతయేల అస్మతపితామహుడు
కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు
శివసముద్రుల భార్యయగు
గంగా గర్భమున జనియించలేదా !!
ఈయన దే కులము ??
నాతో చెప్పింతువేమయ్యా.....
మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు
దేవవేస్యయగు ఊర్వశీపుత్రుడు కాడా ??
ఆతడు పంచమజాతి కన్యయగు
అరుంధతియందు శక్తిని
ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని
ఆ పరాశరుడు పల్లెపడుచు
మత్యగంధియందు మా తాత వ్యాసుని
ఆ వ్యాసుడు విధవరాండ్రైన
మా పితామహి అంబికతో
మా తండ్రిని  పినపితామహి అంబాలికతో
మా పినతండ్రి పాండురాజును
మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని
 మీచే కీర్తింపబడుచున్న
హ.... ఈ విదురదేవుని కనలేదా??
సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాదాన్యములతో
సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది,
కాగా  నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు?

నాయన సుయోధన యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీ వన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే క్షాత్ర మున్నా వారెల్లరు క్షత్రియులే, కాని అందులో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజు పరీక్షల్లో పాల్గొనుటకు అర్హులు.

ఓహో రాచరికమా అర్హతను నిర్నయించునది…!!?
అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యమలమై సంపద విరలమై వెలుగొందుతున్న అంగ రాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మోర్దాపశక్తుని గావించి వేశదను 
సోదరా దుశ్యషణ అనర్గమున శక్తి కిరీటమును వేగముగ తెమ్ము 
మామ గాంధార సార్వభౌమ సురుచిర మనిమండిత మయిన సువర్ణ సింహస నమును తెప్పించుము
పరిజనులరా పుణ్య భాగీరధి నధీ తోయములు అందుకొనుడు 
కళ్యాణ బద్దులార మంగలకుడియంబులు సుస్వరముగా మ్రోగనిండు
వంది మవిదులారా కర్ణ మహారాజును సేవరము గావింపుడు
పున్యంగారులరా ఈ రాదాసుతునుకి పాలభాగమున కస్తూరీ తిలకమును తీర్చి దిద్ది 
బహుజన సుకృత కరీపాక శలభ్ద సహజ కవచ కష్ట వైడుర్య ప్రభాకించోటికి వాని చేగ వీర గంధమును విద్య రాల్పుడు 
నేను ఈ సకల జన సమూహ మున, పండిత పరిక్ష్యత్ మధ్యమున
 సర్వదా సర్వదా సతదా సహసత్రదా పాప ప్రక్షాలమైన కుల కల్మషమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.

Comments

  1. No one can say this type of lengthy dialogues in Indian film industry this type of dialogues is possible only for n t ramarao

    ReplyDelete
    Replies
    1. Absolutely right.. That generation actors were born to act.. Present generation actors are highly paid remuneration but can't say lengthy dialogue but depending on dubbing.

      Delete
  2. Soooo true...the Indian film industry should never forget the contributions of our legendary artists...hatsoff to NTR garu🙏🙏🙏

    ReplyDelete
  3. complete the dialogue totally

    ReplyDelete
  4. we have given full dialogue....check once..thank you!!

    ReplyDelete
    Replies
    1. I think it had more before completing first i.e. after Vidura info about others like naaku chinanna Pandu Raja, Yama Dharma Rajaa, Vayu Devuda, Indruda leka Ashwini Devatala and then eppudo...

      Delete

Post a Comment