- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
పల్లవి: పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంట రోడా నీతో
కొంటె తంటాలని తెచ్చుకుంటానురా
వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానె నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర
" పచ్చ బొట్టేసిన "
చరణం1: మాయగా నీ సోయ గాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హల
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేల
హత్తుకుపో నను ఊపిరి ఆగేల
బాహుబందాల పొత్తిళ్ళలో విచ్చుకున్నావే ఓ మల్లికా
కోడె కౌగిళ్ళ ఒత్తిళ్లలో పురివిప్పింది నా కోరిక
" పచ్చ బొట్టేసిన "
చరణం2: కానలో నువునేను ఒకమేను కాగా
కొనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవసమే
సాంతము నేన్ని సొంతము అయ్యాక
చెమ్మ చేరిటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలిమంచులా
" పచ్చ బొట్టేసిన "
రచన : అనంత శ్రీరామ్
పాడిన వారు : దామిని, కార్తీక్
సంగీతం : M.M కీరవాణి
సినిమా : బాహుబలి ది బిగినింగ్
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment