సోమరిపోతులు | తెలుగు కథలు

సింహపురి గ్రామంలో వీరయ్య, సూరయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ పరమ సోమరిపోతులు. ఏపని చేయకుండా, కాలం వెళ్లబుచ్చేవాళ్ళు. చివరికి వారికీ కావాల్సిన ఆహారానికి కూడా ఇతరుల మీద ఆధారపడేవాళ్లు. ఎవరైనా అలాంటివారికి ఎంతకాలం తిండి పెడతారు. సింహపురి లోని ప్రజలు కూడా వారికి ఆహరం పెట్టడం మానేశారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఇంక సింహపురి లో తమ గురించి తెలిసిపోయింది, ఇంకా ఎవరు సహాయం చేయరు అని పొరుగూరికి వెళ్లి, అక్కడ ఏ శుభకార్యం జరిగినా వెళ్లి బంతిలో కూర్చొని తినేవాళ్లు. ఒక రోజు ఒక ఇంటి గోడపక్కన విస్తరాకులు వేయడం చూసి,అక్కడ ఏదో శుభకార్యం జరుగుతోందని ఉహించి  ఆ ఇంట్లోకి వెళ్లారు.
                  అక్కడ భోజనం చేస్తున్న వారిలో కలిసిపోయి తినడం మొదలుపెట్టారు. ఇంతలో భోజనాల వ్యవహారం చూస్తున్న ఓ వ్యక్తి వచ్చి, మీరు ఎవరు అని వీరయ్య, సూరయ్యలను అడిగాడు. అప్ప్పుడు వారు మేము పెళ్ళికొడుకు మేనమామలం అని చెప్పారు. అదివిన్న అతనికి   వాళ్ళు తేరగా తినడానికి వచ్చారని,  కోపంతో వారిద్దరిని బయటకి గెంటేశాడు ..
            ఇంతకీ అసలు సంగతేందంటే వాళ్ళు  వచ్చింది పెళ్లి ఇంటికి కాదు. చావు దినంకి ..

చూసారు కదా ....!! ఏ పని చేయకుండా , సోమరిపోతుల్లా ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో.. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటాయి. అలాంటిది మనిషిగా పుట్టి ఇలా సోమరిపోతుల్లా ఉండటం సరియైనది కాదు కాబట్టి, ఏదోఒక పని చేసి ఎవరిమీద ఆధారపడకుండా బ్రతకాలి. 


Comments