గాంధీ మహాత్ముణ్ణి నాథురాం గాడ్సే ఎందుకు చంపాడంటే ..!!

బ్రిటిష్ వారి చేతిలో బానిస బతుకు బతుకుతున్న భారతదేశ ప్రజలకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి "మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ". సత్యం, శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశప్రజలందరిని ఏక తాటిపై నడిపించి స్వాతంత్య్రాన్ని సంపాదించాడు. బ్రిటిష్ వారి బానిస సంకెళ్లనుంచి భరతమాతకు విముక్తి కలిగించి, మనదేశ జాతిపితగా గుర్తింపు తెచ్చుకున్నాడు.



Nathuram Godse images | Nathuram Godse


అంతటి గుర్తింపు సాధించిన గాంధీ మహాత్ముణ్ణి "నాథురాం గాడ్సే" హత్య చేసాడు. ఇది ఎవరు ఊహించినది. యావత్ దేశం మహాత్ముని మరణవార్తకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశానికీ స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడు అలా హత్యకు గురవడంతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. కానీ ఇద్దరు మాత్రం తమ పథకం ఫలించినందుకు ఆనందించారు. వారే నాథురాం గాడ్సే మరియు నారాయణ ఆప్టే .....


నాథురాం గాడ్సే గాంధీ మహాత్ముణ్ణి చంపడానికి గల కారణాలు :

అప్పటి వరకు గాంధీ మహాత్ముని అభిమానిగా , మహాత్ముని ఆశయాలను, ఆలోచనలను గౌరవించిన గాడ్సే ఎందుకు మహాత్ముణ్ణి చంపబోయాడు. అంత కిరాతకానికి ఒడిగట్టే అంతగా గాడ్సేని ఉసిగొల్పిన అంశాలు యేవో ఇప్పుడు చూద్దాం.

Muhammad Ali Jinnah and Gandhi Mahatma | telugusanchika

బ్రిటిష్ వారి చేతిలో నుంచి మనదేశానికి ఆగష్టు 14 ' 1947 అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ సంతోషం ఇంకా పూర్తికాగానే ఒక కొత్తసమస్య వచ్చి పడింది. అదే భారతదేశం - పాకిస్థాన్ విభజన. మనదేశంలో హిందువులతో పాటు, ముస్లింలు కూడా ఎక్కువగా ఉన్నారు. వారికీ వేరే దేశం కావాలని మహమ్మద్ అలీ జిన్నా( కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా ముస్లిం లీగ్ అధ్యక్షుడు, పాకిస్తాన్ జాతిపిత ) తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. మతప్రాతిపదికన భారతదేశాన్ని విడదేయాలని , లేకపోతే అంతర యుద్ధం తప్పదని హెచ్చరించాడు. దేశంలో అంతర యుద్ధం జరిగితే చాలా నష్టం వాటిల్లుతుందని భావించిన గాంధీ మహాత్ముడు దేశ బాగుకోసం అందుకు అంగీకరించాడు. అయితే విభజన జరిగేసమయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అందులో ముఖ్యమైనది భారత్ , పాకిస్థాన్ కి 75 కోట్లు ఇవ్వాలని. విడిపోయేటప్పుడు ఒప్పందంలో భాగంగా భరత్ 20 కోట్ల రూపాయలను పాకిస్థాన్ కి భారతదేశ కేంద్రప్రభుత్వం ఇచ్చింది. మిగతా డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీనికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే మనం అంత డబ్బు పాకిస్థాన్ కి ఇస్తే ఆర్థికంగా బలంగా వున్న పాకిస్తాన్ , తిరిగి మన దేశంపై యుద్దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కానీ మహాత్ముడు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఇస్తామన్న డబ్బు ఇవ్వక పోతే పాకిస్థాన్ నుంచి మనదేశానికి భారీ నష్టం వాటిల్లుతుందన్న భావనతో , వారికి ఇస్తామన్న డబ్బు (50 కోట్లు )మొత్తం ఇవ్వాలని జనవరి 13' 1948 తేదీన దీక్ష చేపట్టాడు.

jammu massacres | Hindhu and Sikhs deaths in jammu

పాకిస్థాన్ కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా , పాకిస్థాన్ లో వుండే హిందువులని, సిక్కులని (20,0000 మందికి పైగా ) అతి కిరాతకంగా చంపినా పాకిస్థాన్ కోసం మహాత్ముడు దీక్ష చేపట్టడమేంటని దేశప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు. మహాత్ముడు దీక్ష చేపట్టడంతో కేంద్రం దిగివచ్చి పాకిస్థాన్ కి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకుంది. దీనిని నాథురాం గాడ్సే అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. స్వాతంత్రోద్యమంలో మహాత్ముని ఆలోచనలకూ ఫిదా అయిన, గాడ్సేపాకిస్థాన్ విషయంలో తీవ్ర వ్యతిరేకత చూపించాడు. పత్రికలలో తరచూ మహాత్ముణ్ణి వ్యతిరేకించాడు. మహాత్ముడు చేసే పనులు నచ్చక, పాకిస్థాన్ విషయంలో దేశంపై పక్షపాతాన్ని చూపడం జీర్ణించుకోలేక పోయిన గాడ్సే మహాత్ముణ్ణి అంతమొందించాలని , నిర్ణయించుకున్నాడు. అంతే, తన అనుచరులతో కలిసి పథకం పన్నాడు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే వారు మహాత్ముణ్ణి చంపాక పోలీసులకి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ముఖ్య ఉద్దెశం ఏంటంటే, మహాత్మున్ని చంపడం వెనుకగల కారణం దేశప్రజలందరికి తెలియాలి అని.
మహాత్ముణ్ణి చంపడానికి గాడ్సే మరియు అతని అనుచరులు వేసిన పథకాలు :

నాథురాం గాడ్సే మరియు నారాయణ ఆప్టే మహాత్ముని హత్య వెనుక ప్రధాన నిందితులు. నారాయణ ఆప్టే నాథురాం గాడ్సేకి ఆప్తుడు, ఇద్దరు కలిసి 6 సంవత్సరాలు హిందూమహాసభలో పనిచేసారు. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నాడు. అయితే నారాయణ ఆప్టే వృత్తిపరంగా ఉపాధ్యాయుడు. దేశరక్షణకై పరితపించే వ్యక్తి. నారాయణ ఆప్టే కూడా గాంధీ పాకిస్థాన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని వ్యతిరేకించాడు. మహాత్ముడు చనిపోతే పాకిస్థాన్ తిరిగి భారతదేశంలో కలుస్తుందనే ఉద్దెశంతో మహాత్ముణ్ణి అంతమొందించడానికి గాడ్సేతో కలిసి పథకాన్ని రచించారు. వీరికి సావర్కర్, విష్ణు కర్కరే,దిగంబర్ బడ్గే, గోపాల్ గాడ్సే, మదన్‌లాల్ బహ్వా, శంకర్ కిష్టయ్య సహకరించారు.



Gandhi with Manu and Abha | gandhi death images

మహాత్ముడు పాకిస్థాన్ కి డబ్బు ఇవ్వాలని దీక్ష చేపట్టిన తేదీ జనవరి 13' 1948. గాడ్సే జనవరి 20' 1948 న మొదటిసారి ఢిల్లీలోని బిర్లాహౌస్ లో హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పథకాన్ని రచించారు. మహాత్ముడు ప్రసంగం చేసే వేదిక వెనుకవైపు వున్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నారు . ఇందుకోసం తమలో ఒకరైన దిగంబర్ బడ్జె ని ఎన్నుకున్నారు. కానీ అది కుదరలేదు. గోపాల్ గాడ్సే వేదికకు దగ్గరలో ఉన్న కిటికీ నుంచి బాంబు వేయాలనుకున్నాడు. అది కూడా కుదరలేదు. కుదరక పోగా వారు పట్టుబడ్డారు. ఇది తెలుసుకున్న జనం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోయారు. ఎప్పుడు శాంతి, అహింసతో బ్రతికే గాంధీ మహాత్ముడు వారిని విడిచిపెట్టమని కోరారు. అందుకే గాంధీ మహాత్ముడు అయ్యాడని దేశప్రజలందరూ ప్రశంసించారు. ఇది గాడ్సేకి , అతని బృందానికి ఒక మంచి అవకాశం మహాత్ముణ్ణి చంపడానికి. ఎందుకంటే వారికి ప్రాణం పోతుందన్న భయం ఏమాత్రం లేదు. మహాత్ముణ్ణి చంపకుండా చేస్తామన్న భయం తప్ప. ఎటుతిరిగి మహాత్ముణ్ణి చంపాలనుకుంటున్న గాడ్సే మరియు అతని బృందం దొరికిపోయినా కూడా భయపడకుండా మల్లి పథకం రచించారు.


ఈ సరి ఏకంగా గాడ్సే స్వయంగా రంగంలోకి దిగాడు. ఎటుతిరిగి ఈ సారి మహాత్ముణ్ణి అంతమొందించాలన్న దృఢ సంకల్పంతో అందుకు కావాల్సిన పక్కా ప్రణాలికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇటాలియన్ కంపెనీ నుండి ఒక శరణార్థి సహాయంతో బారిటా పిస్టల్ ని కొనగోలుచేశాడు. జనవరి 30 '1948 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థన సమావేశమందిరానికి మహాత్ముడు వెళుతుండగా నాథురాం గాడ్సే ఎదురుపడ్డాడు. మహాత్ముడికి నమస్కరించాడు. గాంధీమహాత్మునికి ఊత కర్రలా ఉండే గాంధీ అనుచరురాలు అభాచటోపాధ్యాయ గాడ్సేని పక్కకు నెట్టబోయింది. కానీ గాడ్సే అభాను పక్కకునెట్టి తనతో తెచ్చుకున్న తుపాకితో 3 సార్లు పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపాడు. మహాత్ముడు "హే రామ్ " అంటూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గాంధీ మహాత్ముణ్ణి చంపిన నాథురాం అక్కడే ఉండిపోయాడు.



Gandhi Death images| Gandhi Assassinated images
నాథురాం గాడ్సేను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. నాథురాం గాడ్సే తానే మహాత్ముణ్ణి చంపానని అంగీకరించడంతో 1949 నవంబర్ 15 న ఉరి తీశారు. అదే రోజున హత్యలో గాడ్సేకి సంహరించిన నారాయణ ఆప్టేని కూడా ఉరి తీశారు.
గాంధీ మహాత్ముడి హత్య విషయంలో ప్రభుత్వం మరియు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే మహాత్ముడిని హత్యకు కుట్ర జరగడం ఇది మొదటి సరి కాదు. ఒకసారి హత్యాయత్నం చేస్తూ ప్రత్యక్షంగా దొరికిపోయినప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వారిపై ఒక నిఘా వేసివుంటే అంతటి దారుణం జరిగేది కాదు. హత్యాయత్నం చేసిన పది రోజులలోనే ఇంత ఘోరం జరగడం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్షమే. మహాత్ముడు కూడా అంత గొప్ప మనసుతో వారిని విడిచిపెట్టడం కూడా ఒక కారణం. ఏదైతేనేం దేశం గాంధీ మహాత్ముణ్ణి కోల్పోయింది. దేశానికీ స్వాత్యంత్రంని సంపాదించిపెట్టిన వ్యక్తి హత్యకు గురికావడం చాల బాధాకరం.


Comments