ఆర్తీఅగర్వాల్ ....తనదైన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితో నటించి , మెప్పించింది. అయితే ఆర్తీఅగర్వాల్
అతి చిన్న వయసులోనే మరణించి , తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ఆర్తీఅగర్వాల్ జననం మరియు బాల్యం :
ఆర్తీఅగర్వాల్ మార్చి 5' 1984 వ సంవత్సరంలో, అమెరికా లోని అట్లాంటిక్ సిటీలో జన్మించింది. వీరు అమెరికాలో స్థిరపడ్డ గుజరాతీలు ..ఆర్తీఅగర్వాల్ తండ్రి కౌశిక్ అగర్వాల్, తల్లి వీమా అగర్వాల్. ఆర్తీఅగర్వాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆర్తి అగర్వాల్ కి ఒక సోదరి వుంది ఆమె అతిధి అగర్వాల్. ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన గంగోత్రి సినిమాలో నటించింది.
ఆర్తీఅగర్వాల్ సినీరంగ ప్రవేశం:
అందరి కథానాయికల్లాగే ఆర్తీఅగర్వాల్ కూడా మొదట్లో మోడలింగ్ చేసింది. అమెరికాలోని ఫిలడెల్పియాలో ఒక స్టేజ్ షోని ఇచ్చింది ఆర్తీఅగర్వాల్ . అది చూసిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గారు ఆమెను ప్రోత్సహించి, సినిమా రంగంలోకి రావడానికి కావాల్సిన ప్రోత్సాహాన్నిచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఆర్తీఅగర్వాల్ ని భారతీయ సినిమా రంగంలోకి ప్రోత్సాహించింది అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. బిగ్ బీ ఇచ్చిన ప్రోత్సాహంతో, "ఆర్తి పాగల్ పాన్ "సినిమాలో నటించారు. జూన్ 8' 2001 లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరో కరణ్ నాథ్ , ఆర్తి అగర్వాల్ ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఊహించని విధంగా ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆర్తీఅగర్వాల్ కి తిరుగులేకుండా పోయింది. వరుసగా తెలుగు సినిమాలకు ఓకే చేసింది. తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. తరువాత నువ్వులేక నేనులేను, అల్లరి రాముడు, నరసింహుడు, ఇంద్ర, నీ స్నేహం, బాబీ, పలనాటి బ్రహ్మనాయిడు, వసంతం, వీడే, నేనున్నాను, అడవి రాముడు, ఛత్రపతి, సంక్రాంతి, సోగ్గాడు, అందాల రాముడు, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం , వణకన్య వండర్ వీరుడు, రణం 2 సినిమాలలో నటించింది. అతి తక్కువ సమయంలో చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ , బాలకృష్ణ, రాజశేఖర్, మహేష్ బాబు, ప్రభాస్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి హీరోలతో నటించి , తనకు తిరుగులేదు అనిపించుకుంది.
జనాలు పుట్టించే పుకార్లు ఎంతటి వారినైనా నిరాశకు గురిచేస్తాయి, కొన్ని సార్లు ప్రాణాలు తీసుకునేంతగా వేధిస్తాయి ఆ పుకార్లు. అలాంటి విషయమే ఆర్తీఅగర్వాల్ కి ఎదురైంది. హీరో, హీరోయిన్ కాస్త చనువుగా ఉంటే వారి మధ్య చెప్పలేనన్ని పుకార్లు పుట్టుకొస్తాయి. ఆర్తీఅగర్వాల్ , తరుణ్ విషయంలో అదే జరిగింది. వారిరువురి మధ్య అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లు తట్టుకోలేక 2005 ' మార్చి 23 న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాలతో బయటపడ్డ ఆర్తీఅగర్వాల్ పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ లో తరుణ్ గురించి, తన గురించి వస్తున్న పుకార్లు తనను చాలా బాధపెట్టాయని, అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకోబోయానని చెప్పింది. తర్వాత ఫిబ్రవరి 15' 2006 లో మెట్లమీద నుంచి కింద పడి , చాలాకాలం సినిమాలకు దూరంగా ఉంది.
|
arthi agarwal wedding images |
సినిమాలకు దూరంగా ఉంటున్న ఆర్తీఅగర్వాల్ 2007' నవంబర్ 22 న గుజరాత్ కు చెందిన ఉజ్వల్ నికమ్ ని పెళ్లి చేసుకుంది. ఉజ్వల్ అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్నారు. పెళ్లి అయిన 2 సంవత్సరాలకే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఉజ్వల్ నుంచి విడాకులు తీసుకుంది. వ్యక్తిగత సమస్యలనుంచి బయటపడడానికి మల్లి సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. జంక్షన్లో జయమాలిని, రణం 2 సినిమాలలో నటించింది. కానీ అవి అంతగా హిట్టు కాలేదు. ఆర్తి రీఎంట్రీ ఇచ్చే సమయానికి అధిక బరువు కలిగి వుంది. సినిమాలలో ఆఫర్లు రావాలంటే సన్నగా, నాజూగ్గా ఉండాలి. ఆర్తీఅగర్వాల్ తన అధిక బరువు తగ్గించుకోవడానికి జూన్ 4' 2015 లో లైపో సర్జెరీ అమెరికాలో చేయించుకుంది. అది వికటించి , ఇన్ఫెక్షన్ అయ్యి గుండెపోటుతో జూన్ 6' 2015 లో మరణించింది. ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో అగ్రతారగా ఉన్న ఆర్తీఅగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, రెండుసార్లు మరణం అంచులదాకా వెళ్లి, తిరిగి తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చేసిన ప్రయత్నంలో తన ప్రాణాలనే కోల్పోయింది.
|
Arthi Agarwal Death Images | telugusanchika
ఆర్తీఅగర్వాల్ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు ఒక మంచి నటిని కోల్పోయారు. ...ఆర్తీఅగర్వాల్ ఆత్మ శాంతికలగాలని కోరుకుందాం....
|
|
Comments
Post a Comment