- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అతి చిన్న వయసులో సంపాదించడం మొదలుపెట్టి , రోజురోజుకు హన ఆలోచన పరిధిని పెంచుకుంటూ, వివిధ విభాగాలలో డబ్బుని పెట్టుబడిగా పెడుతూ ఆర్థికంగా అంచలంచెలుగా ఎదుగుతూ, సాంకేతిక యుగంలోకూడా అతి సాధారణ జీవితం గడుపుతూ..ఆర్థికంగా ఎదగడానికి సూచనలు ఇస్తూ , విభిన్న ఆలోచనలు, వైవిధ్యమైన ఆచరణతో, ఆర్ధిక రంగంతోపాటు, సామజిక సేవతో తనదైన శైలిలో ముందుకు వెళుతూ, కోట్ల మందిలో ఒక్కడిగా ఉన్న "వారెన్ బఫెట్ " బాల్యం గురించి తెలుసుకుందాం....
" వారెన్ ఎడ్వార్డ్ బఫెట్ " బఫెట్ పూర్తి పేరు. బఫెట్ ఆగష్టు , 1930 లో నెబ్రాస్ఖలోని , ఒమాహాలో పుట్టారు. బఫెట్ నాన్న పేరు హోవార్డ్ బఫెట్. అమ్మ పేరు లీలా బఫెట్. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. వారిలో బఫెట్ రెండవవాడు.
బఫెట్ చిన్నప్పుడు తన తాతగారి కిరాణా షాపులో పనిచేసేవాడు. అంతేకాకుండా వార్తాపత్రికలు, స్టాంపులు అమ్మేవాడు. బఫెట్ 11 ఏళ్ళ వయసులోనే షేర్లను కొన్నాడు. 13 ఏళ్లకే ఆదాయపు పన్ను రాబడికి దాఖలు చేసుకున్నాడు. అంత చిన్న వయసులోనే బఫెట్ ఇన్ని చేయడం మామూలు విషయం కాదు. బఫెట్ D .C లోని వుడ్రోవిల్సన్ హైస్కూల్ లో విద్యాభ్యాసము చేశారు. 1950లో నెబ్రాస్కా విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో B .S పట్టా అందుకున్నాడు.
తాను ఎంతగానో అభిమానించే, ప్రఖ్యాత రక్షణ విశ్లేషకులైన బెంజిమన్ గ్రాహం ( ది ఇంటిలిజెన్స్ ఇన్వెస్టర్ రచయిత ) మరియు డేవిడ్ డాడ్ లు కొలంబియా బిజినెస్ స్కూల్ లో భోదకులుగా వున్నారని తెలుసుకొని బఫెట్ ఆ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1951 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో M .S పట్టా అందుకున్నాడు. తన అభిమాన బోధకుల దగ్గరనుంచి బఫెట్ నేర్చుకున్న ఆర్ధిక మెలకువలతో సరికొత్త సూత్రాలతో , ఆర్థిక వ్యవస్థను శాసించడం మొదలుపెట్టాడు....
" డబ్బు మనిషిని సృష్టించదు ....మనిషే డబ్బును సృష్టించాడు." అన్న సూత్రాన్ని పాటిస్తే అందరూ డబ్బును సృష్టించడం కష్టమేమి కాదు...అవరోధాలు, అవకాశాలు వేరువేరు కాదు, ఓ గొప్ప విజయానికి స్వాగత ద్వారాలే అన్న విషయం బఫెట్ జీవితం చూస్తే అర్ధమవుతుంది.
విద్యానంతరం బఫెట్ 1951-1954 లో ఓమహాలోని బఫెట్ పార్క్ అండ్ కోలో ముదుపు విక్రయదారుడిగా పనిచేశారు. 1951 లో బెంజిమన్ గ్రాహం ( బఫెట్ బాగా అభిమానించే వ్యక్తి ) "GEICO" అనే భీమా సంస్థలో వున్నదని తెలుసుకున్న బఫెట్ వెంటనే "GEICO" ఉపాధ్యక్షుడు లోరిమేర్ డేవిడ్సన్ ని కలిసాడు. వారిద్దరూ భీమవ్యాపారాన్ని గురించి కొన్ని గంటలపాటు చర్చించారు. ఆ సమయంలో లొరేమేర్ డేవిడ్సన్ , బఫెట్ కి ప్రభావితుడయ్యాడు.
అప్పటికి ఆర్థికరంగంలో హెచ్చుతగ్గులను, మెళకువలను, తెలుసుకున్న బఫెట్ ఒమాహాకు తిరిగివచ్చి , స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తూనే, నెబ్రాస్కో విశ్వవిద్యాలయంలో రాత్రి తరగతులలో , పొదుపు సూత్రాలను బోధించాడు. అయితే బఫెట్ విద్యార్థులు తనకంటే రెట్టింపు వయసు వాళ్ళు. తనకన్నా ఎక్కువ వయసు వున్న వారికి ఆర్ధిక పాఠాలు చెప్పాడంటే బఫెట్ ఎంత మేధావో అర్ధమవుతోంది.
"1952" లో బఫెట్ సుసాన్ థామ్సన్ ని వివాహం చేసుకున్నాడు. వారికి సుసాన్ ఆలిస్ బఫెట్, హోవార్డ్ గ్రాహం బఫెట్, పీటర్ యాండ్రివ్ బఫెట్ సంతానం....
బఫెట్ బెంజిమన్ గ్రాహం భాగస్వామ్యంలో ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు.బఫెట్ మొదటి ఆదాయం సంవత్సరానికి 97,000 $ . అయితే బఫెటికి గ్రాహంతో పనిచేయడం ఇష్టంలేక తన భాగస్వామ్యాన్ని ఆపివేశాడు.ఆ సమయంలో బఫెట్ వ్యక్తిగత నిల్వలు 1,74,000 $ కన్నా ఎక్కువ. అంతేకాకుండా బఫెట్, పార్టనర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక పొదుపు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు.
స్వశక్తి, సంకల్ప బలంతో ఆర్థికంగా ఎదిగిన బఫెట్, 2006లో తన యావదాస్తిని , ధార్మిక సంస్థలకు ఇచ్చేయాలని అనుకున్నారు. బిల్ గేట్స్, పేద పిల్లల చదువు, ఆరోగ్యం కోసం కృషిచేస్తున్నారని , ఇంతకన్నా గొప్పకార్యం ఏముంటుందని బఫెట్ తన ఆస్తిలో 83% బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ కి చెందాలని ప్రకటించారు. అప్పట్లో ( జూన్ 23, 2006 ) అది దాదాపు 30.7 బిలియన్లు .... చరిత్రలో అది అతిపెద్ద విరాళము. అంతేకాకుండా బఫెట్ సామజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ , తన సహృదయాన్ని , మానవత్వాన్ని చాటుతూ , అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు. 2007లో తన వ్యాపారాలను చూసుకోవడానికి ఒక యువవారసుడు కావాలని ప్రకటించారు. "GEICO "లో ముదుపులను చూసుకునే లౌ సింప్సెన్ ని వారసుడుగా ఎంచుకున్నాడు.అయితే సింప్సెన్ బఫెట్ కన్నా 6 సంవత్సరాలు మాత్రమే చిన్నవాడు. 2008లో బఫెట్ ఫోర్బ్స్ ప్రకారం 62 బిలియన్ డాలర్లు మరియు యాహూ ప్రకారం 58 బిలియన్ డాలర్లు కలిగి అప్పటివరకు వున్న బిల్ గేట్స్ ని తోసిపుచ్చి ప్రపంచములో అత్యధిక ధనవంతుడు అయ్యాడు.
2008లో బఫెట్ యొక్క లావాదేవీలన్నీ విపరీతమైన మార్కెట్ తో మార్కెట్ నష్టాలలో నడిచాయి. మార్చి 2009 లో దూరదర్శన్ ముఖాముఖిలో బఫెట్ ఆర్ధిక వ్యవస్థ శిఖరము నుంచి పడిపోయిందని చెప్పారు. 1970 లో వున్న నిరుద్యోగం మరియు ద్రవ్యోల్భణం తిరిగి చూస్తామేమో అని బఫెట్ అన్నారు.
1977 నుంచి సుసాన్ ( బఫెట్ భార్య ) , బఫెట్ విడివిడిగా జీవించడం మొదలు పెట్టారు. అయినా వాళ్ళు వివాహితులుగానే వున్నారు. 2004 లో బఫెట్ భార్య సుసాన్ మరణించారు. 2006 న తన 76 వ పుట్టినరోజునాడు తన చిరకాల స్నేహితురాలు , బ్రహ్మచారిణి అయిన 66 సంవత్సరాల అస్త్రిడ్ మెంక్స్ ను వివాహం చేసుకున్నారు.
2006లో వార్షిక వేతనం సుమారు లక్ష డాలర్లు. మరియు 2008 మూలవేతనంతో కలుపుకుని మొత్తము లక్ష డెబ్భైవేల డాలర్లు జీతాన్ని అతడు గడించాడు. అయితే బఫెట్, 1958 లో 31,500 డాలర్లకు కొనగోలుచేసిన ఓమహో యొక్క సెంట్రల్ డండీ నైబర్హుడ్ లోని అదే ఇంటిలో నివసిస్తున్నారు. ఇవాళ దాని విలువ 7 లక్షల డాలర్లు. బఫెట్ ఇప్పటికి నోకియా ఫ్లిప్ ఫోన్ నే వాడుతున్నారు. 2014 వరకు క్యాడిలాక్ కారునే వాడారు. అంతేకాకుండా బఫెట్ కు వ్యక్తిగత జెట్ విమానం కూడా వుంది. దానికి బఫెట్, " ది ఇండెఫీన్సిబుల్ " అని పేరు పెట్టారు. అయితే ఆయన దాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడతారు. అంతేకాకుండా బఫెట్ అవసరాల ప్రాతిపదికన వస్తువులను వాడతారు. ఇవన్నీ బఫెట్ యొక్క నిరాడంబరతకు నిదర్శనాలు. 1951లో సల్స్ మెన్ వృత్తితో జీవితం 2008 లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడయ్యాడు. బఫెట్ వివిధ వ్యాసాలను రాసారు.ఇందులో ద్రవ్యోల్భణము యొక్క అతి హానికరమైన ప్రభావాల గురించి చెప్పాడు....
బఫెట్ కి వారసత్వ సంపదపై నమ్మకం లేదు..గొప్ప అదృష్టాలను ఒకతరం నుండి తర్వాతి తరానికి బదలాయించడాన్ని బఫెట్ వ్యతిరేకిస్తున్నారు. " ప్రతివ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలన్నట్లు " బఫెట్ తన పిల్లలకు మేము ఏదైనా చేయగలము అనుకోవటానికి సరిపోయేంత మాత్రమే నేను వారికీ ఇస్తాను ..కానీ, మేము ఏమి చేయకూడదు అని అనుకునేంత ఎక్కువ మాత్రం ఇవ్వను అని చెప్పారు..
వారెన్ బఫెట్ ....!! ప్రపంచ కుబేరులలో ముందు స్థానంలో వుంటారు. ఈయన తన 11 ఏళ్ళ వయసునుంచే సంపాదించడం మొదలు పెట్టాడు. తను ఈ క్రమంలో ఎన్నో విజయాల్ని, వైఫల్యాలను చవిచూశాడు. కానీ బఫెట్ వైఫల్యాలకు నిరాశచెందకుండా, ప్రేరణతో, తన గత అనుభవాల ఆధారంగా , కొన్ని విలువైన సూత్రాలతో , సిద్ధాంతాలతో ఆర్థికంగా ఎదిగాడు. ఒక సరికొత్త రూపంలో పాత పెట్టుబడి విధానాలకు స్వస్తిచెప్పి , కొత్త ఆర్ధిక పెట్టుబడి విధానాలను పాటిస్తూ కొత్త సూత్రాలకు అర్థం చెప్పారు.

ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి బఫెట్ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు :
1. ఒకే ఆదాయం మీద ఆధారపడకూడదు. సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టడం ద్వారా మరింత డబ్బును సంపాదించవచ్చు.
2. మనం ఎంత అయితే పొదుపు చేయాలనీ అనుకుంటామో అంత డబ్బును పొదుపు చేయగా, మిగిలిన డబ్బును ఖర్చుపెట్టాలి.
3. అవసరంలేని వస్తువులను కొంటూపోతే , ఏదో ఒకరోజు అవసరమైన వస్తువులను అమ్మాల్సి ఉంటుంది.
4. మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్ లో పొదుపు చేయకూడదు. కొంత డబ్బు వేరే విభాగాలలో పొదుపు చేయాలి
బఫెట్ నిబంధనలు:
1. ఎన్నడూ వాటాదారులు డబ్బు నష్టపోకుండా చూడటం.
2. మొదటి నిబంధనను మరచిపోకుండా ఉండటం
బఫెట్ అదే ఊరిలో వున్నా ప్రపంచానికి తన ఊరిని పరిచయం చేసారు ..ప్రస్తుతం బఫెట్ బెర్కషైర్ హాత్వ్ CEO గా కొనసాగుతున్నారు. కాగా ఇందులో 60కి పైగా కంపెనీలు వున్నాయి. వాటిలో జియోకో, డ్యూరాసెల్ మరియు డైరాక్వీన్ వున్నాయి. ప్రస్తుతం 88 సంవత్సరాల బఫెట్ 3వ స్థానంలో కొనసాగుతూ కోట్లమందిలో ఒక్కరిగా వున్న వారెన్ ఎడ్వార్డ్ బఫెట్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Warren Buffet
Warren Buffet in Telugu
Warren Buffet Investment Strategy
Warren Buffet quotes
Warren Buffet Quotes in Telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment