Devdas Mohan Das Gandhi ( మహాత్మాగాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ గురించి ఆసక్తివిషయాలు )

దేవదాస్ మోహన్ దాస్  గాంధీ:

దేవదాస్ గాంధీ ,  మహాత్మాగాంధీ సంతానంలో చిన్నవాడు ( నాలుగవ కుమారుడు ) . ఈయన జీవితం మిగిలిన ముగ్గురు కుమారుల కంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. తన సోదరులతో పోలిస్తే ఇతను కొంచెం ప్రత్యకం. దేవదాస్ గాంధీ గురించి , ఆయన వ్యక్తిగత, వృత్తిపర అంశాలు ఇప్పుడు చూద్దాం. 
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi

దేవదాస్ మోహన్ దాస్  గాంధీ బాల్యం:

దేవదాస్ గాంధీ మే 22, 1900 సంవత్సరంలో  దక్షిణాఫ్రికాలో జన్మించాడు. మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడం కోసం దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చాడు. మనదేశానికి తిరిగివచ్చేటప్పటికీ దేవదాస్ గాంధీ చిన్నవాడు. ఇక్కడి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ లోని, కాంగ్రా గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. పశ్చిమ బెంగాల్ లో వున్న శాంతినికేతన్ లో తదుపరి విద్యను అభ్యసించాడు. చదువులో బాగా రాణించడమే కాకుండా, తన తండ్రి ఆశయాలకు అనుగునంగా ఎదిగాడు. 

దేవదాస్ వివాహం మరియు సంతానం :

Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Gandhi Wife images | Devadas Gandhi wife Lakshmi Gandhi
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Gandhi Family 

దేవదాస్ గాంధీ , లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాడు . లక్ష్మి కూడా దేవదాస్ ని ప్రేమించింది. ఈమె స్వాతంత్య్ర సమరయోధుడు అయిన చక్రవర్తి రాజగోపాలాచారి కుమార్తె. ఈయన వృత్తి పరంగా న్యాయవాది మరియు ప్రముఖ రచయిత. వీరి సొంత ఊరు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా, తోరపల్లి . వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. రాజగోపాలాచారి కూడా గాంధీజీతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. గాంధీకి, రాజగోపాలాచారికి మంచి సాన్నిహిత్యం ఉండడంతో దేవదాస్, లక్ష్మి ప్రేమను కాదనలేక పోయారు. కానీ అప్పటికి లక్ష్మికి 15 సంవత్సరాలు అవ్వడంతో, వీరిద్దరిని 5 సంవత్సరాలు ఒకరిని ఒకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉండాలని షరతు పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే గాంధీ, రాజగోపాలాచారి బాల్య వివాహం చేయడం ఇష్టంలేదని అర్ధమవుతోంది. ఆకాలంలో బాల్యవివాహాలు సర్వసాధారణం అయినప్పటికీ , వీరు దాన్ని వ్యతిరేకించి, లక్ష్మి మేజర్ అయ్యేదాకా వేచివున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ అప్పటికి దేవదాస్ గాంధీ వయసు 28 సంవత్సరాలు. 

 గాంధీ, రాజగోపాలాచారి చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు దూరంగా వున్నారు. తర్వాత పెద్దల సమక్షంలో వివాహం (1933) లో  చేసుకున్నారు. వీరికి ముగ్గురు  కుమారులు,ఒక కుమార్తె జన్మించారు. వారు 

1. రాజమోహన్ గాంధీ 
2.గోపాలక్రిష్ణ గాంధీ 
3. రామచంద్ర గాంధీ 
4. తారా గాంధీ 

వృత్తి జీవితం :

Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi images
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi with Mahatma Gandhi

తన విద్యాభ్యాసం తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. దేశంలో హిందీ భాష ప్రాధాన్యాన్ని విస్తరించాలని మహాత్మాగాంధీ భావించాడు అందుకోసం దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రాధాన్యాన్ని పెంచాడనికి మద్రాసులో 1918 లో "దక్షిణ భారత హిందీ ప్రచారసభ "ను  మహాత్మా గాంధీ స్థాపించాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రజలు హిందీ నేర్చుకునేలా ప్రేరేపించారు.  చదువులో బాగా రాణించిన  దేవదాస్ గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచారసభలో  హిందీ పాఠాలను  బోధించాడు. గాంధీజీ స్వదేశీ ఉద్యమం చేస్తున్నప్పుడు , మన దేశంలో తయారైన నూలు వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశప్రజలందరూ, స్వదేశీ వస్త్రాలనే ధరించాలని కోరాడు. ఆంధ్రప్రాంతంలో సన్న నూలు వస్త్రాలు తయారవుతున్నాయని తెలుసుకున్న గాంధీజీ , దేవదాస్ ను వాటి నాణ్యతను పరిశీలించి రమ్మని దేవదాస్ కి చెప్పాడు. దేవదాస్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడ తయారయ్యే నూలు వస్త్రాల గురించి అన్ని విషయాలు తెలుసుకుని , నివేదికను మహాత్మాగాంధీకి సమర్పించాడు. దేవదాస్ సమర్పించిన నివేదిక తర్వాత పొందూరు ఖద్దరుకు మంచి ఆదరణ వచ్చేలా చేసాడు మహాత్మాగాంధీ. 

            యంగ్ ఇండియా, నవజీవం వంటి పత్రికలలోనే కాకుండా , మోతిలాల్ నెహ్రు స్థాపించిన ఇండిపెండెంట్ పత్రికలో కూడా పనిచేసాడు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేసాడు. వార్తాపత్రికలలో పనిచేస్తున్నప్పుడు దేవదాస్ గాంధీ దేశ ప్రజలలో , ధైర్యాన్ని నింపి, బ్రిటిష్ వారిపై స్వాతంత్య్రం కోసం పోరాడేలా చేసాడు. పత్రికాసంపాదకుడిగా, పాత్రికేయుడిగా ఎనలేని సేవలు అందించాడు. స్వతంత్రం కోసం పోరాటంలో భాగంగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. 

దేవదాస్ గాంధీ మరణం :

మహాత్మా గాంధీ అంత్యక్రియలలో రామ్ దాస్ గాంధీతో కలిసి అంత్యక్రియలలో పాల్గొన్నాడు. మహాత్మాగాంధీ తో దేవదాస్ గాంధీ కలిసి స్వాతంత్రోద్యమంలో పరోక్షంగా తోడున్నాడు. అయితే తన తండ్రి చనిపోయిన 10 సంవత్సరాలకే చనిపోయాడు. దేవదాస్ గాంధీ కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడ్డాడు.  1957 ఆగష్టు 3 వ తేదీన అనారోగ్యంతో బొంబాయిలో మరణించాడు. 

Comments