- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
మహాత్మాగాంధీ పెద్దకొడుకు హరిలాల్ గాంధీ చెడు వ్యసనాలకి బానిస అని మీకు తెలుసా?
హరిలాల్ గాంధీ :
హరిలాల్ గాంధీ , గాంధీజీకి మొదటి సంతానం. ఈయన ఆగష్టు 23'1888 లో జన్మించాడు. హరిలాల్ గాంధీ 1906 లో "గులాబ్ గాంధీని" వివాహం చేసుకున్నాడు . వీరికి 5 గురు సంతానం. పిల్లలు రాణి, మను, కాంతిలాల్, రసిక్ లాల్, శాంతీలాల్ . వీరిలో రసిక్ లాల్, శాంతీలాల్
చిన్నతనంలోనే మరణించారు..
చిన్నతనంలోనే మరణించారు..
Harilal Gandhi | Mahatma Gandhi Elder Son Harilal Gandhi |
హరిలాల్ గాంధీ చిన్నతనంలో వున్నప్పుడు గాంధీజి న్యాయవిద్య అభ్యసించడానికి ఇంగ్లాండు వెళ్ళాడు. గాంధీజీ మనదేశానికి తిరిగివచ్చి , స్వాతంత్రోద్యమం చేస్తున్నప్పుడు, హరిలాల్ గాంధీకూడా 1908-1911 మధ్య కాలంలో చురుకుగా పాల్గొన్నాడు. అంతేకాకుండా ఈ 3 సంవత్సరాలలో 6 సార్లు సత్యాగ్రాహిగా ఖైదు చేయబడ్డాడు. స్వాతంత్రోద్యమంలో తండ్రికి ధీటుగా పాల్గొంటున్న హరిలాల్ గాంధీని "చోటే గాంధీ " అని ప్రశంసించారు. ఈ విధంగా తండ్రితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న హరిలాల్ కూడా తన తండ్రి లాగానే న్యాయశాస్త్రం ఇంగ్లాండ్ లో చదవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సంగతి తన కుటుంబసభ్యులకు చెప్పాడు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడు మనం బ్రిటిషువారిపై స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో నువ్వు వెళ్లి ఇంగ్లాండ్ లో చదువుకోవడం జరగదని తేల్చిచెప్పేసాడు బాపూజీ. ఈ విషయం హరిలాల్ కి అస్సలు మింగుడు పడలేదు. తాను ఇంగ్లాండులో చదువుకోవడానికి గాంధీజీ అంగీకరించక పోవడంతో 1911 లో , తన కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు.పేరుకు పెద్దకొడుకు అయినప్పటికీ గాంధీజీతో హరిలాల్ గాంధీకి సత్సంబంధాలుకొనసాగించలేదు..
గాంధీజీకి 1911 నుండి దూరంగా ఉంటున్నాడు హరిలాల్ , అయితే తన 48 సంవత్సరాల వయసులో హిందూమతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలనుకున్నాడు. 1936 మే నెలలో తాను ఇస్లాం మతంలోకి మారుతున్నట్టు బహిరంగంగా ప్రకటించాడు. అలాగే తన పేరును అబ్దుల్లా గాంధీగా మార్చుకున్నాడు. హరిలాల్ మతం మార్చుకోవడం తన కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీనితో హరిలాల్ తల్లి, కస్తూరి బా కోరికమేరకు హరిలాల్ తిరిగి హిందూమతంలోకి మారి "హిరలల్ " అనే పేరు పెట్టుకున్నాడు..
హరిలాల్ భార్య గులాబ్ గాంధీ, 1918 లో అనారోగ్యంతో ( ఇన్ఫ్లుఎంజా పాండెమిక్ ) మృతిచెందింది. గులాబ్ చనిపోయిన తర్వాత తన పిల్లలకు దూరంగా ఉన్నారు. గులాబ్ చనిపోయిన తర్వాత తన చెల్లి అయిన " కుమి అదలాజ " ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే ఆమె వితంతువు. అయితే కొన్ని కారణాల వళ్ల ఆ వివాహం జరగలేదు. భార్య చనిపోవడం , తండ్రికి, కుటుంబానికి దూరంగా ఉండటం తో హరిలాల్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. మద్యంసేవించడం, జులాయి తనం ఎక్కువ అయిపోయింది. గాంధీజీకి స్వాతంత్రోద్యమం కోసం పోరాడటం ఒక ఎత్తుఅయితే , హరిలాల్ చెడుఅలవాట్లు మరొక ఎత్తు. తన కుమారుడు ఇలా చెడు వ్యసనాలకు బానిసై , జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని తీవ్రంగా మధన పడ్డాడు. ఇందుకు సాక్ష్యాలు 1935 జూన్ నెలలో గాంధీజీ
హరిలాల్ కు రాసిన లేఖలే నిదర్శనం. ఈ లేఖలో గాంధీజీ పలు అంశాలను ప్రస్తావించారు. అవి హరిలాల్ చెడువ్యసనాలకు బానిస అవ్వడం గురించి మరియు తన కుమార్తె అయిన మను పై లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి అంశాలపై ముఖ్యంగా ప్రస్తావించారు. హరిలాల్ తన సొంత కూతురైన మను పై లైంగిక వేధిపులకు( అత్యాచారం ) గురిచేసినట్టు, స్వయంగా మను ఏ గాంధీతో చెప్పిందని లేఖలో పేర్కొన్నాడు.
గాంధీ హరిలాల్ కి 1935 జూన్ 6, జూన్ 19, జూన్ 27 లో రాసిన 3 లేఖల ను 2014 లో 80,000 పౌండ్లకు వేలం వేశారు. కానీ అంత పెద్ద మొత్తంతో కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. 20,000 పౌండ్లకు తగ్గించినా కూడా ఎవరు వాటిని కొనలేదు. ఈ లెటర్లు గుజరాతీ భాషలో ఉన్నాయి.
గాంధీజీ హత్యకు గురియైన తర్వాత , అంత్యక్రియలకు హరిలాల్ హాజరయ్యాడు. అప్పటికే చెడువ్యసనాలకు నిండా బానిస అయిన హరిలాల్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. హరిలాల్ కామతీపురలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించారు. హరిలాల్ గాంధీజీ కుమారుడని ఆసుపత్రి యాజమాన్యానికి తెలియదు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యలకు కూడా తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలియదు.
గాంధీ చనిపోయిన నాలుగు నెలల తర్వాత హరిలాల్ ( 1948 జూన్ 6) రాత్రి సమయంలో బొంబాయిలో మునిసిపల్ ఆసుపత్రిలో క్షయ వ్యాధితో మరణించాడు. మరిణించేంత వరకు హరిలాల్ ఆసుపత్రిలో ఉన్నట్టు కుటుంబసభ్యులకు తెలియదు.
ఆగస్టు 3 ' 2007 లో గాంధీ మరియు హరిలాల్ మధ్య వున్న సమస్యల నేపథ్యంలో "Gandhi , My Father " పేరుతో అబ్బాస్ ఖాన్ దర్శకత్వంలో సినిమా విడుదలైంది. హరిలాల్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఈ చిత్రంలో గాంధీజీ, హరిలాల్ మధ్య జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించారు..

హరిలాల్ సంతానమైన రాణికి - అనుశ్రయ , ప్రబోధ్, నీలం & నవమాలిక
మనుకి -ఊర్మి ; కాంతిలాల్ కి - శాంతి, ప్రదీప్ పిల్లలు జన్మించారు.
ఆగస్టు 3 ' 2007 లో గాంధీ మరియు హరిలాల్ మధ్య వున్న సమస్యల నేపథ్యంలో "Gandhi , My Father " పేరుతో అబ్బాస్ ఖాన్ దర్శకత్వంలో సినిమా విడుదలైంది. హరిలాల్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఈ చిత్రంలో గాంధీజీ, హరిలాల్ మధ్య జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించారు..
Gandhi letters to Harilal Gandhi
Harilal Gandhi
Harilal Gandhi Children
Harilal Gandhi Death
Harilal Gandhi Wife and Family
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment