- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
జవహర్ లాల్ నెహ్రు కుమార్తె ఇందిరా ప్రియదర్శిని నెహ్రు వివాహం గురించి ఆసక్తికర విషయాలు :
జవహర్ లాల్ నెహ్రూ ఒక్కగానొక్క ముద్దుల కూతురు ఇందిరా నెహ్రు. ఇందిరా పార్శి కుటుంబానికి చెందిన "ఫిరోజ్ జహంగీర్ ఘాండీ " ని ప్రేమించి , వివాహం చేసుకుంది. ఫిరోజ్ ఘాండీ ఫారెడూన్ జహంగీర్ ఘాండీ , తల్లి రతిమై ఘాండీ . వీరు పార్సీకుటుంబానికి చెందినవారు. ఫిరోజ్ ఘాండీ మహాత్మాగాంధీ ఆదర్శంగా తీసుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మహాత్మాగాంధీని దైవంలా కొలిచాడు. అందుకే తన పేరులో వున్న ఘాండిని గాంధీ గా మార్చుకున్నాడు. ఫిరోజ్ నెహ్రు కుటుంబంలో ఒకడిలా కలిసిపోయి స్వతంత్రం కోసం పోరాడాడు. చిన్నప్పటినుంచి స్వతంత్రం కోసం పరితపించే ఇందిరా ఫిరోజ్ ఆశయాలకు ఆకర్షితురాలైంది. క్రమంగా ఫిరోజ్ ని ఇష్టపడడం మొదలు పెట్టింది. ఫిరోజ్ కూడా ఇందిరా ను ఇష్టపడడం మొదలు పెట్టాడు. వీరిరువురు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి అయిన జవహర్ లాల్ నెహ్రూతో తన నిర్ణయాన్ని చెప్పింది.
Indira Gandhi and Feroze Gandhi images |
ఫిరోజ్ వేరేమతం కావడంతో వీరి ప్రేమవివాహానికి జవహర్ లాల్ నెహ్రు అంగీకరించలేదు. ఎందుకంటే ఇందిరా ఫిరోజ్ ని వివాహం చేసుకుంటే నెహ్రూ వారసత్వం అంతమవుతుందని భావించాడు. ఇదే విషయమై మహాత్మా గాంధీతో చర్చించాడు. మహాత్మాగాంధీ ఇందిరా, ఫిరోజ్ ల ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఫిరోజ్ ని మహాత్మాగాంధీ దత్తత తీసుకుని తనపేరులోని గాంధీ ని ఫిరోజ్ కి ఇచ్చాడు. ఇది ఇంగ్లాండ్ లోని అఫిడవిట్ లో ఫిరోజ్ తన పేరును ఫిరోజ్ గాంధీగా మార్చుకున్నాడు.
Indira Gandhi and Feroze Gandhi Marriage images |
Indira Gandhi Husband, Indira Gandhi marriage images |
అలా ఫిరోజ్ ఘాండి కాస్త ఫిరోజ్ గాంధీ అయ్యాడు. మహాత్మాగాంధీ వీరి పెళ్ళికి అంగీకరించడంతో జవహర్ లాల్ నెహ్రు కూడా అయిష్టంగానే అంగీకరించాడు. చాలా సంఘర్షణల తర్వాత 1942 మార్చి 26 న వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇందిరా నెహ్రు కాస్త ఇందిరా గాంధీ అయ్యింది. అదే సంవత్సరంలో మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో భాగంగా "క్విట్ ఇండియా " ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రు జైలు పాలయ్యారు. వీరి అరెస్టుతో ఉద్యమం తారాస్థాయికి చేరింది. దేశ ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ కూడా ఖైదు చేయబడింది. ఈమె జైలు నుంచి 1943 మే 13 న విడుదలైంది. తర్వాత ఫిరోజ్ గాంధీకి కొంతకాలం దూరంగా ఉంది. రాజీవ్ గాంధీ 2 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు తిరిగి ఫిరోజ్ గాంధీ వద్దకు వెళ్ళింది. అప్పుడు ఫిరోజ్ లక్నో లోని నేషనల్ హెరాల్డ్ పత్రికలో పనిచేసేవాడు. వారిద్దరి మధ్య తిరిగి విభేదాలు రావడంతో ఇందిరా తిరిగి జవహర్ లాల్ నెహ్రు వద్దకు వచ్చేసింది. తర్వాత తన తండ్రికి రాజకీయాలలో అండగా నిలిచింది.
Indira Gandhi and Feroze Gandhi with Nehru images |
ఫిరోజ్ గాంధీ అనారోగ్యంతో 1960 సెప్టెంబర్ 8 న మృతిచెందారు. వివాహమైన 18 సంవత్సరాలకే ఇందిరా భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన 4 సంవత్సరాల వ్యవధిలో తనకు అండగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా వున్న జవహర్ లాల్ నెహ్రు కూడా 1964 మే 27 న మరణించారు. భర్తను, తండ్రిని పోగొట్టుకున్న ఇందిరా గాంధీ మనోధైర్యాన్ని కోల్పోకుండా , రాజకీయ పరంగా నిలదొక్కుకుంది.
Jawaharlal Nehru Death images |
వీరికి మొదటి సంతానం రాజీవ్ గాంధీ 1944 ఆగష్టు 20 న , రెండవ సంతానం సంజయ్ గాంధీ 1946 డిసెంబర్ 14 న జన్మించారు. ఇందిరా గాంధీ, చిన్న కుమారుడైన సంజయ్ గాంధీ తన 33 వ ఏట (1980, జూన్ 23 ) విమాన ప్రమాదంలో మరణించాడు. సంజయ్ గాంధీ మరణంపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇతని మరణం అనుమానాస్పదమైనప్పటికీ కొన్ని కారణాల రీత్యా దీని గురించి ఎవరు లోతుగా అధ్యయనం చేయలేదు. ఏదేమైనా ఇందిరా చాలా ధైర్యవంతురాలు. తండ్రిని, భర్తని, కొడుకుని పోగొట్టుకుని కూడా దేశానికి ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టింది. అందుకేనేమో ఇందిరా గాంధీని ఉక్కు మహిళ అని పిలుస్తారు.
Sanjay Gandhi Death images |
Feroze Gandhi
Feroze Gandhi death
Indira Gandhi
Indira Gandhi Children
Indira Gandhi death
Indira Gandhi Husband
Indira Gandhi Marriage
Rajiv Gandhi
Sanjay Gandhi
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment