Mahatma Gandhi Children Harilal Gandhi, Manilal Gandhi, Ramlal Gandhi, Devdas Gandhi

"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ " భారత జాతిపిత అని అందరికి తెలుసు. కానీ గాంధీ సంతానం గురించి చాలామందికి తెలియదు. గాంధీ పిల్లలు ఎవరు, వారు ఏమి చేస్తుంటారు అన్న విషయాలు  పెద్దగా ఎప్పుడూ , ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. గాంధీ పిల్లలు ఎవరు, వారి వారసులు ఎవరో  తెలుసుకుందాం.

1.హరిలాల్ గాంధీ :

హరిలాల్ గాంధీ , గాంధీజీకి మొదటి సంతానం. ఈయన ఆగష్టు 23'1888 లో జన్మించాడు. హరిలాల్ గాంధీ 1906 లో "గులాబ్ గాంధీని" వివాహం చేసుకున్నాడు . వీరికి 5 గురు సంతానం.  పిల్లలు రాణి, మను, కాంతిలాల్, రసిక్ లాల్, శాంతీలాల్ . వీరిలో రసిక్ లాల్, శాంతీలాల్
చిన్నతనంలోనే  మరణించారు..

Harilal Gandhi images,  Mahatma Gandhi Elder Son Harilal Gandhi, harilal gandhi death,Harilal Gandhi | Mahatma Gandhi Elder Son Harilal Gandhi Family
Harilal Gandhi | Mahatma Gandhi Elder Son Harilal Gandhi



               హరిలాల్ గాంధీ చిన్నతనంలో వున్నప్పుడు  గాంధీజి  న్యాయవిద్య అభ్యసించడానికి ఇంగ్లాండు వెళ్ళాడు. గాంధీజీ మనదేశానికి తిరిగివచ్చి , స్వాతంత్రోద్యమం చేస్తున్నప్పుడు, హరిలాల్ గాంధీకూడా 1908-1911 మధ్య కాలంలో చురుకుగా పాల్గొన్నాడు. అంతేకాకుండా ఈ 3 సంవత్సరాలలో 6 సార్లు సత్యాగ్రాహిగా ఖైదు చేయబడ్డాడు. స్వాతంత్రోద్యమంలో తండ్రికి ధీటుగా పాల్గొంటున్న హరిలాల్ గాంధీని "చోటే గాంధీ " అని ప్రశంసించారు. ఈ విధంగా తండ్రితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న హరిలాల్ కూడా తన తండ్రి లాగానే న్యాయశాస్త్రం ఇంగ్లాండ్ లో చదవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సంగతి తన కుటుంబసభ్యులకు చెప్పాడు. కానీ గాంధీజీ అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడు మనం బ్రిటిషువారిపై స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో నువ్వు వెళ్లి ఇంగ్లాండ్ లో చదువుకోవడం జరగదని తేల్చిచెప్పేసాడు బాపూజీ. ఈ విషయం హరిలాల్ కి అస్సలు మింగుడు పడలేదు. తాను ఇంగ్లాండులో చదువుకోవడానికి గాంధీజీ అంగీకరించక పోవడంతో 1911 లో , తన కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు.పేరుకు పెద్దకొడుకు అయినప్పటికీ గాంధీజీతో హరిలాల్ గాంధీకి సత్సంబంధాలుకొనసాగించలేదు.. 

             
గాంధీజీకి 1911 నుండి దూరంగా ఉంటున్నాడు హరిలాల్ , అయితే తన 48 సంవత్సరాల వయసులో హిందూమతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలనుకున్నాడు. 1936 మే నెలలో తాను ఇస్లాం మతంలోకి మారుతున్నట్టు బహిరంగంగా ప్రకటించాడు. అలాగే తన పేరును అబ్దుల్లా గాంధీగా మార్చుకున్నాడు. హరిలాల్ మతం మార్చుకోవడం తన కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీనితో హరిలాల్ తల్లి, కస్తూరి బా కోరికమేరకు హరిలాల్ తిరిగి హిందూమతంలోకి మారి "హిరలల్ " అనే పేరు పెట్టుకున్నాడు..

హరిలాల్ భార్య గులాబ్ గాంధీ, 1918 లో అనారోగ్యంతో ( ఇన్ఫ్లుఎంజా పాండెమిక్ )   మృతిచెందింది. గులాబ్ చనిపోయిన తర్వాత తన పిల్లలకు దూరంగా ఉన్నారు. గులాబ్ చనిపోయిన తర్వాత తన చెల్లి  అయిన  " కుమి అదలాజ " ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే ఆమె వితంతువు. అయితే కొన్ని కారణాల వళ్ల ఆ వివాహం జరగలేదు. భార్య చనిపోవడం , తండ్రికి, కుటుంబానికి దూరంగా ఉండటం తో హరిలాల్ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. మద్యంసేవించడం, జులాయి తనం ఎక్కువ అయిపోయింది.  గాంధీజీకి స్వాతంత్రోద్యమం కోసం పోరాడటం ఒక ఎత్తుఅయితే , హరిలాల్ చెడుఅలవాట్లు మరొక ఎత్తు. తన కుమారుడు ఇలా చెడు వ్యసనాలకు బానిసై , జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని తీవ్రంగా మధన పడ్డాడు. ఇందుకు సాక్ష్యాలు 1935 జూన్ నెలలో గాంధీజీ
హరిలాల్ కు రాసిన లేఖలే నిదర్శనం. ఈ లేఖలో గాంధీజీ పలు అంశాలను ప్రస్తావించారు. అవి హరిలాల్ చెడువ్యసనాలకు బానిస అవ్వడం గురించి మరియు తన కుమార్తె అయిన మను పై లైంగిక వేధింపులకు గురిచేయడం వంటి అంశాలపై ముఖ్యంగా ప్రస్తావించారు. హరిలాల్  తన సొంత కూతురైన మను పై లైంగిక వేధిపులకు( అత్యాచారం ) గురిచేసినట్టు, స్వయంగా మను ఏ గాంధీతో చెప్పిందని లేఖలో పేర్కొన్నాడు.

            గాంధీ హరిలాల్ కి 1935 జూన్ 6, జూన్ 19, జూన్ 27 లో రాసిన 3 లేఖల ను 2014 లో 80,000 పౌండ్లకు వేలం వేశారు. కానీ  అంత పెద్ద మొత్తంతో కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. 20,000 పౌండ్లకు తగ్గించినా కూడా ఎవరు వాటిని కొనలేదు. ఈ లెటర్లు గుజరాతీ భాషలో ఉన్నాయి.

           గాంధీజీ హత్యకు గురియైన తర్వాత , అంత్యక్రియలకు హరిలాల్ హాజరయ్యాడు. అప్పటికే చెడువ్యసనాలకు నిండా బానిస అయిన హరిలాల్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. హరిలాల్ కామతీపురలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించారు. హరిలాల్ గాంధీజీ కుమారుడని ఆసుపత్రి యాజమాన్యానికి తెలియదు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యలకు కూడా తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు కూడా తెలియదు.
గాంధీ చనిపోయిన నాలుగు నెలల తర్వాత హరిలాల్  ( 1948 జూన్ 6) రాత్రి సమయంలో బొంబాయిలో మునిసిపల్ ఆసుపత్రిలో క్షయ వ్యాధితో మరణించాడు. మరిణించేంత వరకు హరిలాల్ ఆసుపత్రిలో ఉన్నట్టు కుటుంబసభ్యులకు తెలియదు.

హరిలాల్ సంతానమైన రాణికి - అనుశ్రయ , ప్రబోధ్, నీలం & నవమాలిక 
మనుకి -ఊర్మి ; కాంతిలాల్ కి - శాంతి, ప్రదీప్  పిల్లలు జన్మించారు.

       ఆగస్టు 3 ' 2007 లో గాంధీ మరియు హరిలాల్ మధ్య వున్న సమస్యల నేపథ్యంలో "Gandhi , My Father " పేరుతో అబ్బాస్ ఖాన్ దర్శకత్వంలో సినిమా విడుదలైంది. హరిలాల్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఈ చిత్రంలో గాంధీజీ, హరిలాల్ మధ్య జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించారు..



"మణిలాల్ గాంధీ" మహాత్మాగాంధీ సంతానంలో రెండవ వాడు. 1892 అక్టోబర్ 28 న గుజరాత్ లో జన్మించారు. మణిలాల్ గాంధీ తన తండ్రి మహాత్మాగాంధీకి స్వాతంత్రోద్యమంలో తోడుగా ఉన్నారు. ఇతను కూడా స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన 25 ఏళ్ళ వయసులో 1927 సంవత్సరంలో సుశీల మష్రువాలా ను వివాహం చేసుకున్నారు.

1.మణిలాల్ గాంధీ సంతానం :

మణిలాల్ గాంధీకి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరందరూ దక్షిణాఫ్రికాలోనే నివసిస్తున్నారు.

మొదటి సంతానం : "సీత " (సీత  ధైర్యబాల దుపెలియా ) 1928
 రెండవ సంతానం :"అరుణ్ మణిలాల్ గాంధీ " 1934
 చివరి సంతానం:  " ఈలా గాంధీ   " 1940 లో జన్మించారు.

Manilal Gandhi Images |Manilal Gandhi Family | Son of Mahatma Gandhi
Manilal Gandhi Images | Son of Mahatma Gandhi
Indian Opinion, Indian Opinion news paper, Indian Opinion news paper in West Africa
Indian Opinion 

మణిలాల్ గాంధీ వృత్తి :


 మణిలాల్ గాంధీ చాలావరకు ఆయన జీవితాన్ని దక్షిణాఫ్రికాలోనే గడిపారు. బ్రిటిష్ వారు భారతదేశంతో పాటు , దక్షిణాఫ్రికా లోని చాలా దేశాలను ఆక్రమించుకుని పరిపాలించేవారు. బ్రిటిష్ వారు, భారతీయులను దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి అక్కడ వెట్టి చాకిరి చేయించేవారు. భారతీయులు దక్షిణాఫ్రికాలో అష్టకష్టాలు పడేవారు. అనేక వివక్షలకు గురయ్యారు. అందులో ముఖ్యంగా వర్ణవివక్ష ఎక్కువగా ఉండేది. ఇవన్నీ చూసిన గాంధీజీ చలించి పోయాడు. ఎలాగైనా మనవారిని వర్ణవివక్షకు గురికాకుండా , వారిని కాపాడడానికి " ఇండియన్ ఒపీనియన్ " అనే వార్తాపత్రికను దక్షిణాఫ్రికాలో స్థాపించాడు.

    దక్షిణాఫ్రికాలో అక్టోబర్ 10' 1899 - 1902 మే '31 వరకు రెండవ బోయెర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత దక్షిణాఫ్రికా బ్రిటిష్ వారి హస్తగతమైంది. దక్షిణాఫ్రికాకి వలస వెళ్లిన భారతీయులపై తీవ్ర ఆంక్షలను విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతీయులను అక్కడకు తీసుకువెళ్లి గొడ్డుచాకిరి చేయించడమే కాకుండా తీవ్ర వివక్షలకు గురిచేశారు.

గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ పత్రికను అక్కడ వున్న భారతీయ ప్రముఖుల సహకారంతో స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా భారతీయులపై చూపుతున్న వివక్షతపై పోరాడాలనుకున్నాడు. 1903, జూన్ 6 వ తేదీన మొదటి సంచికను విడుదల చేశారు. ఈ పత్రికలో మణిలాల్ గాంధీ సంపాదకునిగా పనిచేశారు. అంతేకాకుండా ఈ వార్తాపత్రిక పూర్తి భాద్యతలను తాను చనిపోయేంత వరకు చూసుకున్నాడు. ఈ వార్తాపత్రిక దక్షిణాఫ్రికాలో వున్న భారతీయులు  పౌరహక్కులు  పొందడానికి ఎంతగానో తోడ్పడింది. ఈ వార్తాపత్రిక బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంతో ఇందులోని ఉద్యోగులు చాలాసార్లు ఖైదు చేయబడ్డారు. అయినా సరే బ్రిటీషు వారికి తలవంచకుండా భారతీయుల హక్కుల కోసం, వారి మనుగడ కోసం అనుక్షణం పోరాటం చేసారు.

మణిలాల్ గాంధీ మరణం :


     మణిలాల్ గాంధీ ఏప్రిల్ 5' 1956 లో దక్షిణాఫ్రికాలోని దుర్బాన్ లో సెరిబ్రల్ త్రొమ్బోసిస్ ( మస్తిష్కానికి సంబంధించిన వ్యాధి ) తో మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన సతీమణి సుశీల మష్రువాలా వార్తాపత్రిక బాధ్యతలు చేపట్టారు. 1988 ' నవంబర్ లో సుశీల మష్రువాలా కూడా దక్షిణాఫ్రికాలో  మరణించారు. మణిలాల్ చనిపోయినప్పట్నుంచి గాంధీ కుటుంబ ఆశయాలను , ఇండియన్ ఒపీనియన్ పత్రికను జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. కానీ ఆమె మరణించే కొన్ని రోజులముందు ఆ పత్రికను మూసివేయాల్సి వచ్చింది.

Manilal Gandhi, Mahatma Gandhi, mahatma Gandhi Son, Mahatma Gandhi Children, Manilal Gandhi images, Manilal Gandhi wife, Manilal Gandhi family, Manilal Gandhi Children
Manilal Gandhi Images |Manilal Gandhi Family | Son of Mahatma Gandhi

సుశీల మష్రువాలా మధ్యప్రదేశ్ లోని అకోలా లోని ధనవంతుల కుటుంబంలో జన్మించారు. గాంధీజీకి తమవంతుగా పోరాటంలో మద్దతు మరియు ఆర్థిక సహాయం చేసారు. చిన్నవయసులో సుశీల మష్రువాలా మలేరియా వ్యాధి సోకింది. దీనికోసం క్వినైన్ అధికంగా తీసుకున్నారు. అధిక మోతాదులో క్వినైన్ తీసుకోవడం వలన ఆమెకు వినికిడి లోపం వచ్చింది. తన 19 ఏళ్ళ వయసులో మణిలాల్ గాంధీని వివాహం చేసుకొని , మణిలాల్ తోపాటు దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. తాను చనిపోయేవరకు పత్రిక భాద్యతలు చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది.




3.రామ్ దాస్ గాంధీ :

రామ్ దాస్ గాంధీ , మహాత్మా గాంధీ మూడవ కుమారుడు. ఈయన జనవరి 2 '1897 లో జన్మించారు. ఈయన కూడా తన తండ్రితో పాటు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.
రామ్ దాస్ గాంధీ కూడా మణిలాల్ గాంధీలాగే దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడ్డాడు. దక్షిణాఫ్రికాలో అణిచివేతకు గురవుతున్న భారతీయుల కోసం పోరాడాడు. ఈ పోరాటంలో భాగంగా చాలాసార్లు ఖైదు చేయబడ్డాడు. తన తండ్రి పాటించే ఆదర్శ పేదరిక జీవితానికి అలవాటు కాలేకపోయాడు రామ్ దాస్ గాంధీ. 
Ramdas Gandhi, Ramdas Gandhi death, Ramdas Gandhi family, Ramdas Gandhi wife, Ramdas Gandhi children, Ramdas Gandhi death cause, Ramdas Gandhi at Mahatma Gandhi Funeral
Ramdas Gandhi images | Ramdas Gandhi

రామ్ దాస్ గాంధీ వివాహం మరియు సంతానం :

రామ్ దాస్ గాంధీ నిర్మల ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం .

1.సుమిత్ర గాంధీ 
2.కాను గాంధీ 
3.ఉషా గాంధీ 

మహాత్మాగాంధీకి రామ్ దాస్ అంటే అమితమైన ప్రేమ . గాంధీ తాను చనిపోతే తలకొరివి రామ్ దాస్ గాంధీ పెట్టాలని కోరాడు. అందుకే గాంధీజీ చనిపోయాక రామ్ దాస్ గాంధీ , తల కొరివి పెట్టాడు. 
Mahatma Gandhi Funeral images, Ramdas Gandhi at Mahatma Gandhi Funeral images
Mahatma Gandhi Funeral images


దక్షిణాఫ్రికాలో  వున్న భారతీయుల కోసం తన జీవితాన్ని అంకితం చేసాడు. ఇందులో భాగంగా చాలాసార్లు రామ్ దాస్ గాంధీ ఖైదు చేయబడ్డాడు. ఈ పోరాటాలలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. 1969 ఏప్రిల్ 14 న మహారాష్ట్రలో (పూణే ) అనారోగ్యంతో మరణించారు. తన సోదరులందరిలోకి ఎక్కువ కాలం బతికాడు రామ్ దాస్ గాంధీ.  

4.దేవదాస్ మోహన్ దాస్  గాంధీ:

దేవదాస్ గాంధీ ,  మహాత్మాగాంధీ సంతానంలో చిన్నవాడు ( నాలుగవ కుమారుడు ) . ఈయన జీవితం మిగిలిన ముగ్గురు కుమారుల కంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. తన సోదరులతో పోలిస్తే ఇతను కొంచెం ప్రత్యకం. దేవదాస్ గాంధీ గురించి , ఆయన వ్యక్తిగత, వృత్తిపర అంశాలు ఇప్పుడు చూద్దాం. 
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi

దేవదాస్ మోహన్ దాస్  గాంధీ బాల్యం:


దేవదాస్ గాంధీ మే 22, 1900 సంవత్సరంలో  దక్షిణాఫ్రికాలో జన్మించాడు. మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడం కోసం దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చాడు. మనదేశానికి తిరిగివచ్చేటప్పటికీ దేవదాస్ గాంధీ చిన్నవాడు. ఇక్కడి వచ్చాక హిమాచల్ ప్రదేశ్ లోని, కాంగ్రా గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసాడు. పశ్చిమ బెంగాల్ లో వున్న శాంతినికేతన్ లో తదుపరి విద్యను అభ్యసించాడు. చదువులో బాగా రాణించడమే కాకుండా, తన తండ్రి ఆశయాలకు అనుగునంగా ఎదిగాడు. 

దేవదాస్ వివాహం మరియు సంతానం :

Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Gandhi Wife images | Devadas Gandhi wife Lakshmi Gandhi
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Gandhi Family 

దేవదాస్ గాంధీ , లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించాడు . లక్ష్మి కూడా దేవదాస్ ని ప్రేమించింది. ఈమె స్వాతంత్య్ర సమరయోధుడు అయిన చక్రవర్తి రాజగోపాలాచారి కుమార్తె. ఈయన వృత్తి పరంగా న్యాయవాది మరియు ప్రముఖ రచయిత. వీరి సొంత ఊరు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా, తోరపల్లి . వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. రాజగోపాలాచారి కూడా గాంధీజీతో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అంతేకాకుండా భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. గాంధీకి, రాజగోపాలాచారికి మంచి సాన్నిహిత్యం ఉండడంతో దేవదాస్, లక్ష్మి ప్రేమను కాదనలేక పోయారు. కానీ అప్పటికి లక్ష్మికి 15 సంవత్సరాలు అవ్వడంతో, వీరిద్దరిని 5 సంవత్సరాలు ఒకరిని ఒకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉండాలని షరతు పెట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే గాంధీ, రాజగోపాలాచారి బాల్య వివాహం చేయడం ఇష్టంలేదని అర్ధమవుతోంది. ఆకాలంలో బాల్యవివాహాలు సర్వసాధారణం అయినప్పటికీ , వీరు దాన్ని వ్యతిరేకించి, లక్ష్మి మేజర్ అయ్యేదాకా వేచివున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ అప్పటికి దేవదాస్ గాంధీ వయసు 28 సంవత్సరాలు. 

 గాంధీ, రాజగోపాలాచారి చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు దూరంగా వున్నారు. తర్వాత పెద్దల సమక్షంలో వివాహం (1933) లో  చేసుకున్నారు. వీరికి ముగ్గురు  కుమారులు,ఒక కుమార్తె జన్మించారు. వారు 

1. రాజమోహన్ గాంధీ 
2.గోపాలక్రిష్ణ గాంధీ 
3. రామచంద్ర గాంధీ 
4. తారా గాంధీ 

వృత్తి జీవితం :

Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi images
Devdas Mohan Das Gandhi, Devadas Gandhi, Devadas Gandhi images, Devadas Gandhi family, Devadas Gandhi death reason, Devadas Gandhi with Mahatma Gandhi, Devadas Gandhi wife name, Devadas Gandhi children
Devadas Mohan Das Gandhi with Mahatma Gandhi

తన విద్యాభ్యాసం తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. దేశంలో హిందీ భాష ప్రాధాన్యాన్ని విస్తరించాలని మహాత్మాగాంధీ భావించాడు అందుకోసం దక్షిణ భారతదేశంలో హిందీ భాష ప్రాధాన్యాన్ని పెంచాడనికి మద్రాసులో 1918 లో "దక్షిణ భారత హిందీ ప్రచారసభ "ను  మహాత్మా గాంధీ స్థాపించాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రజలు హిందీ నేర్చుకునేలా ప్రేరేపించారు.  చదువులో బాగా రాణించిన  దేవదాస్ గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచారసభలో  హిందీ పాఠాలను  బోధించాడు. గాంధీజీ స్వదేశీ ఉద్యమం చేస్తున్నప్పుడు , మన దేశంలో తయారైన నూలు వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశప్రజలందరూ, స్వదేశీ వస్త్రాలనే ధరించాలని కోరాడు. ఆంధ్రప్రాంతంలో సన్న నూలు వస్త్రాలు తయారవుతున్నాయని తెలుసుకున్న గాంధీజీ , దేవదాస్ ను వాటి నాణ్యతను పరిశీలించి రమ్మని దేవదాస్ కి చెప్పాడు. దేవదాస్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడ తయారయ్యే నూలు వస్త్రాల గురించి అన్ని విషయాలు తెలుసుకుని , నివేదికను మహాత్మాగాంధీకి సమర్పించాడు. దేవదాస్ సమర్పించిన నివేదిక తర్వాత పొందూరు ఖద్దరుకు మంచి ఆదరణ వచ్చేలా చేసాడు మహాత్మాగాంధీ. 

            యంగ్ ఇండియా, నవజీవం వంటి పత్రికలలోనే కాకుండా , మోతిలాల్ నెహ్రు స్థాపించిన ఇండిపెండెంట్ పత్రికలో కూడా పనిచేసాడు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేసాడు. వార్తాపత్రికలలో పనిచేస్తున్నప్పుడు దేవదాస్ గాంధీ దేశ ప్రజలలో , ధైర్యాన్ని నింపి, బ్రిటిష్ వారిపై స్వాతంత్య్రం కోసం పోరాడేలా చేసాడు. పత్రికాసంపాదకుడిగా, పాత్రికేయుడిగా ఎనలేని సేవలు అందించాడు. స్వతంత్రం కోసం పోరాటంలో భాగంగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. 

దేవదాస్ గాంధీ మరణం :

మహాత్మా గాంధీ అంత్యక్రియలలో రామ్ దాస్ గాంధీతో కలిసి అంత్యక్రియలలో పాల్గొన్నాడు. మహాత్మాగాంధీ తో దేవదాస్ గాంధీ కలిసి స్వాతంత్రోద్యమంలో పరోక్షంగా తోడున్నాడు. అయితే తన తండ్రి చనిపోయిన 10 సంవత్సరాలకే చనిపోయాడు. దేవదాస్ గాంధీ కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడ్డాడు.  1957 ఆగష్టు 3 వ తేదీన అనారోగ్యంతో బొంబాయిలో మరణించాడు. 



Comments