Manilal Gandhi Second Son Of Mahatma Gandhi ( మణిలాల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలు )

"మణిలాల్ గాంధీ" మహాత్మాగాంధీ సంతానంలో రెండవ వాడు. 1892 అక్టోబర్ 28 న గుజరాత్ లో జన్మించారు. మణిలాల్ గాంధీ తన తండ్రి మహాత్మాగాంధీకి స్వాతంత్రోద్యమంలో తోడుగా ఉన్నారు. ఇతను కూడా స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన 25 ఏళ్ళ వయసులో 1927 సంవత్సరంలో సుశీల మష్రువాలా ను వివాహం చేసుకున్నారు.

మణిలాల్ గాంధీ సంతానం :

మణిలాల్ గాంధీకి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరందరూ దక్షిణాఫ్రికాలోనే నివసిస్తున్నారు.

మొదటి సంతానం : "సీత " (సీత  ధైర్యబాల దుపెలియా ) 1928
 రెండవ సంతానం :"అరుణ్ మణిలాల్ గాంధీ " 1934
 చివరి సంతానం:  " ఈలా గాంధీ   " 1940 లో జన్మించారు.

Manilal Gandhi Images |Manilal Gandhi Family | Son of Mahatma Gandhi
Manilal Gandhi Images | Son of Mahatma Gandhi
Indian Opinion, Indian Opinion news paper, Indian Opinion news paper in West Africa
Indian Opinion 

మణిలాల్ గాంధీ వృత్తి :


 మణిలాల్ గాంధీ చాలావరకు ఆయన జీవితాన్ని దక్షిణాఫ్రికాలోనే గడిపారు. బ్రిటిష్ వారు భారతదేశంతో పాటు , దక్షిణాఫ్రికా లోని చాలా దేశాలను ఆక్రమించుకుని పరిపాలించేవారు. బ్రిటిష్ వారు, భారతీయులను దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి అక్కడ వెట్టి చాకిరి చేయించేవారు. భారతీయులు దక్షిణాఫ్రికాలో అష్టకష్టాలు పడేవారు. అనేక వివక్షలకు గురయ్యారు. అందులో ముఖ్యంగా వర్ణవివక్ష ఎక్కువగా ఉండేది. ఇవన్నీ చూసిన గాంధీజీ చలించి పోయాడు. ఎలాగైనా మనవారిని వర్ణవివక్షకు గురికాకుండా , వారిని కాపాడడానికి " ఇండియన్ ఒపీనియన్ " అనే వార్తాపత్రికను దక్షిణాఫ్రికాలో స్థాపించాడు.

    దక్షిణాఫ్రికాలో అక్టోబర్ 10' 1899 - 1902 మే '31 వరకు రెండవ బోయెర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత దక్షిణాఫ్రికా బ్రిటిష్ వారి హస్తగతమైంది. దక్షిణాఫ్రికాకి వలస వెళ్లిన భారతీయులపై తీవ్ర ఆంక్షలను విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతీయులను అక్కడకు తీసుకువెళ్లి గొడ్డుచాకిరి చేయించడమే కాకుండా తీవ్ర వివక్షలకు గురిచేశారు.

గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ పత్రికను అక్కడ వున్న భారతీయ ప్రముఖుల సహకారంతో స్థాపించాడు. ఈ పత్రిక ద్వారా భారతీయులపై చూపుతున్న వివక్షతపై పోరాడాలనుకున్నాడు. 1903, జూన్ 6 వ తేదీన మొదటి సంచికను విడుదల చేశారు. ఈ పత్రికలో మణిలాల్ గాంధీ సంపాదకునిగా పనిచేశారు. అంతేకాకుండా ఈ వార్తాపత్రిక పూర్తి భాద్యతలను తాను చనిపోయేంత వరకు చూసుకున్నాడు. ఈ వార్తాపత్రిక దక్షిణాఫ్రికాలో వున్న భారతీయులు  పౌరహక్కులు  పొందడానికి ఎంతగానో తోడ్పడింది. ఈ వార్తాపత్రిక బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంతో ఇందులోని ఉద్యోగులు చాలాసార్లు ఖైదు చేయబడ్డారు. అయినా సరే బ్రిటీషు వారికి తలవంచకుండా భారతీయుల హక్కుల కోసం, వారి మనుగడ కోసం అనుక్షణం పోరాటం చేసారు.

మణిలాల్ గాంధీ మరణం :


     మణిలాల్ గాంధీ ఏప్రిల్ 5' 1956 లో దక్షిణాఫ్రికాలోని దుర్బాన్ లో సెరిబ్రల్ త్రొమ్బోసిస్ ( మస్తిష్కానికి సంబంధించిన వ్యాధి ) తో మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన సతీమణి సుశీల మష్రువాలా వార్తాపత్రిక బాధ్యతలు చేపట్టారు. 1988 ' నవంబర్ లో సుశీల మష్రువాలా కూడా దక్షిణాఫ్రికాలో  మరణించారు. మణిలాల్ చనిపోయినప్పట్నుంచి గాంధీ కుటుంబ ఆశయాలను , ఇండియన్ ఒపీనియన్ పత్రికను జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. కానీ ఆమె మరణించే కొన్ని రోజులముందు ఆ పత్రికను మూసివేయాల్సి వచ్చింది.

Manilal Gandhi, Mahatma Gandhi, mahatma Gandhi Son, Mahatma Gandhi Children, Manilal Gandhi images, Manilal Gandhi wife, Manilal Gandhi family, Manilal Gandhi Children
Manilal Gandhi Images |Manilal Gandhi Family | Son of Mahatma Gandhi

సుశీల మష్రువాలా మధ్యప్రదేశ్ లోని అకోలా లోని ధనవంతుల కుటుంబంలో జన్మించారు. గాంధీజీకి తమవంతుగా పోరాటంలో మద్దతు మరియు ఆర్థిక సహాయం చేసారు. చిన్నవయసులో సుశీల మష్రువాలా మలేరియా వ్యాధి సోకింది. దీనికోసం క్వినైన్ అధికంగా తీసుకున్నారు. అధిక మోతాదులో క్వినైన్ తీసుకోవడం వలన ఆమెకు వినికిడి లోపం వచ్చింది. తన 19 ఏళ్ళ వయసులో మణిలాల్ గాంధీని వివాహం చేసుకొని , మణిలాల్ తోపాటు దక్షిణాఫ్రికాకు వెళ్ళింది. తాను చనిపోయేవరకు పత్రిక భాద్యతలు చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది.






Comments