- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
జవహర్ లాల్ నెహ్రు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. భారత జాతిపిత మహాత్మాగాంధీకి సన్నిహితంగా మెలుగుతూ భారతస్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని , మన దేశాన్ని పాలించిన నెహ్రు కుటుంబం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గంగాధర్ నెహ్రు సంతానం : ( 1 st generation )
గంగాధర్ నెహ్రు తండ్రి లక్ష్మీనారాయణ నెహ్రు. గంగాధర్ నెహ్రు, జానూ రాణి దంపతులకు 5 గురు సంతానం . వారిలో చిన్నవాడు మోతిలాల్ నెహ్రు.
1. బన్సీధర్
2. నందలాల్
3. పత్రాని
4. మహారాణి
5. మోతిలాల్
మోతీలాల్ నెహ్రు సంతానం : (2 nd generation )
మోతిలాల్ నెహ్రు స్వరూప రాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం
1. జవహర్ లాల్ నెహ్రు
2. విజయలక్ష్మి పండిట్
3. క్రిష్ణా హుతీసింగ్
జవహర్ లాల్ నెహ్రు సంతానం : ( 3 rd generation )
జవహర్ లాల్ నెహ్రు భార్య కమల నెహ్రు. వీరి వివాహం 1916 ఫిబ్రవరి 8 న జరిగింది. వీరికి 1917 నవంబర్ 19 న ఇందిరా ప్రియదర్శిని జన్మించారు. ఒక్కగానొక్క కూతురు కావడంతో చాలా గారాబంగా పెంచారు.ఇందిరా ప్రియదర్శిని సంతానం : ( 4th generation )
ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ గాంధీని ప్రేమ వివాహం 1942 మార్చి 26 న చేసుకున్నారు.వీరికి ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు.
1. రాజీవ్ గాంధీ ( 1944 ఆగష్టు 20 )
2. సంజయ్ గాంధీ ( 1946 డిసెంబర్ 14 )
రాజీవ్ గాంధీ సంతానం : ( 5 th generation )
రాజీవ్ గాంధీ ఎడ్విగ్ ఆంటోనియా ఆల్బిన మైనో ని వివాహం ( 1968, ఫిబ్రవరి 25 ) చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె పేరును సోనియా గాంధీగా మార్చుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మించారు.
1. రాహుల్ గాంధీ ( 1970 , జూన్ 19 )
2. ప్రియాంక గాంధీ (1972, జనవరి 12 )
సంజయ్ గాంధీ సంతానం : ( 5th generation )
సంజయ్ గాంధీ , మేనకా గాంధీని 1974, సెప్టెంబర్ 23 న వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీ 1980 మార్చి 13 న జన్మించాడు.
ప్రియాంక గాంధీ సంతానం : ( 6 th generation )
ప్రియాంక గాంధీ రాబర్ట్ వర్డ్రా ని 1997 ఫిబ్రవరి 18 న వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు .
1. మిరాయ వర్డ్రా ( 24 జూన్ 2002 ) ( 7 th generation )
2. రైహన్ వర్డ్రా ( ఆగష్టు 29' 2000 ) ( 7 th generation )
వరుణ్ గాంధీ సంతానం :
వరుణ్ గాంధీ , యామిని రాయ్ చౌదరిని వివాహం (మార్చి 6 '2011 ) న వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె అనసూయ గాంధీ జన్మించారు . అనసూయ గాంధీ ఆగష్టు 18 ' 2014 న జన్మించింది.
అనసూయ గాంధీ ( ( 7 th generation ) )
Feroze Gandhi
Gandhi Family
Indira Gandhi
jawaharlal nehru
kamala nehru
menaka gandhi
Mothilal Nehru
Nehru Family
priyanka gandhi
rahul gandhi
Rajiv Gandhi
Sanjay Gandhi
sonia gandhi
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment