Robert Vadra Priyanka Gandhi Love Story | Robert Vadra

ప్రియాంక గాంధీ ప్రేమకథ :

ప్రియాంక గాంధీ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ముద్దుల కుమార్తె . సోనియా గాంధీ , రాజీవ్ గాంధీ జంటకు ఇద్దరు సంతానం . ఒకరు రాహుల్ గాంధీ, ఇంకొకరు ప్రియాంక గాంధీ. 
ప్రియాంక గాంధీ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో  చురుకుగా పాల్గొంటోంది. ఈమె వ్యక్తిగత విషయాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు. రాజకీయ అంశాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విషయాల గురించి చర్చించదు . అందుకే ప్రియాంక గాంధీ వ్యక్తిగత విషయాలు చాలా మందికి తెలియదు.  ప్రియాంక గాంధీ కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .
Priyanka Gandhi Husband, Priyanka Gandhi Love Story, Priyanka Gandhi Marriage images, Robert Vadra, Who is Robert Vadra, Robert Vardra Profession, Priyanka gandhi family, priyanka gandhi age
Priyanka Gandhi Marriage with Robert Vadra

                    ప్రియాంక గాంధీ ప్రేమ వివాహం చేసుకుంది. అవునండీ ....నమ్మబుద్ధి కావట్లేదా ..అంత సెక్యూరిటీ , ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వుండే మీడియా ...వీరికి ఎవరికి తెలియకుండా ఎలా జరిగిందా అనుకుంటున్నారా ..... ఇలా అనుకోవడం సహజమే. ప్రియాంక గాంధీ రాబర్ట్ వడ్రా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంతకీ రాబర్ట్ వడ్రా ఎవరు అంటే ఉత్తరప్రదేశ్  కి చెందిన  వారు. వీరు పంజాబీ ఖాత్రి కుటుంబానికి చెందినవారు. ఇతని తండ్రి రాజేంద్ర వడ్రా , తల్లి మౌరీన్  బ్రిటిష్ కుటుంబానికి  చెందినది. అయితే ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాడ్ర సోదరి చిన్నప్పుడు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. రాబర్ట్ సోదరి ద్వారా ప్రియాంక గాంధీ పరిచయమైంది. వీరు పరిచయం అయినప్పుడు ప్రియాంక వయసు 13 సంవత్సరాలు మాత్రమే. వీరు 1991 - 1992 మధ్య కాలంలో పరిచయమయ్యారు. అయితే అదే సమయంలో ప్రియాంక గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ చనిపోవడంతో, రాబర్ట్ ప్రియాంకకు ధైర్యం చెప్పి, తోడుగా ఉన్నాడు. 
Priyanka Gandhi Husband, Priyanka Gandhi Love Story, Priyanka Gandhi Marriage images, Robert Vadra, Who is Robert Vadra, Robert Vardra Profession, Priyanka gandhi family, priyanka gandhi age
priyanka gandhi with Rahul gandhi | Priyanka Gandhi Family 

              క్రమంగా వీరు పెరిగే కొద్దీ , వీరి బంధం కూడా పెరగసాగింది. రాబర్ట్ రాహుల్ గాంధీకి కూడా మంచి స్నేహితుడయ్యాడు. ఒకసారి వీరిద్దరి స్నేహం గురించి మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.  రాబర్ట్ ధైర్యం చేసి తనని వివాహం చేసుకోమని ప్రియాంక గాంధీని అడిగాడు. ప్రియాంకకు కూడా చిన్నప్పటినుంచి రాబర్ట్ తెలుసు కాబట్టి, తాను కూడా ఇష్టపడటం తో ఒకే చెప్పింది.సోనియా గాంధీది కూడా ప్రేమ వివాహం కావటం,  రాహుల్ , రాబర్ట్ కి మధ్య వున్న స్నేహం వీరి వివాహానికి ప్లస్ అయ్యింది. సోనియా గాంధీ కూడా వీరి పెళ్లికి అంగీకరించింది. వీరి వివాహం చేసేముందు ఇంటలిజెన్స్ బ్యూరో రాబర్ట్ కుటుంబ నేపధ్యం , రాబర్ట్ గురించి పూర్తిగా అవగాహనకి వచ్చి , పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రియాంక గాంధీ, రాబర్ట్ వడ్రా వివాహం 1997 ' ఫిబ్రవరి 18 న గాంధీ హోంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. 
Priyanka Gandhi Husband, Priyanka Gandhi Love Story, Priyanka Gandhi Marriage images, Robert Vadra, Who is Robert Vadra, Robert Vardra Profession, Priyanka gandhi family, priyanka gandhi age
Priyanka Gandhi and robert Vardra
Priyanka Gandhi Husband, Priyanka Gandhi Love Story, Priyanka Gandhi Marriage images, Robert Vadra, Who is Robert Vadra, Robert Vardra Profession, Priyanka gandhi family, priyanka gandhi age
Priyanka Gandhi Marriage images 

Comments