సిల్క్ స్మిత చనిపోయేముందు రాసిన ఉత్తరం | Silk Smitha Suicide Letter

సిల్క్ స్మిత..యావత్ తెలుగు ప్రజలనే కాకుండా, తమిళ, మలయాళీ, కన్నడ ప్రేక్షకులను తన అందంతో, నటనతో తన వశం చేసుకుంది. అలాంటి అగ్రతార ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మిత ఏంటి ఆత్మహత్య ఏంటి? అసలు సిల్క్ స్మితకి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చింది అనుకున్న అభిమానులు లేకపోలేరు. సిల్క్ స్మిత స్వయంగా చనిపోయేముందు లేఖ రాసింది. అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

"అభాగ్యురాలు 22/9/1996
దేవుడా నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు.  నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి , నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేసాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం  కోసం పుట్టించాడు రాము. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు . నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో  నాకే తెలియును."
Silk Smitha images ,Silk Smitha Suicide Note
Silk Smitha images | Silk Smitha Suicide Note 

             
                  ఇందులో  ఒకడు తనని పెళ్లిచేసుకుంటానని ,  నరకం చూపించింది ఎవరో కాదు, తాను సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిచయమైన డాక్టర్ రాధాకృష్ణ . అతనే సిల్క్ స్మితకు నరకం చూపించి, ఆత్మహత్య చేసుకునేలా చేసాడు.



Comments

  1. Eumaxindia specializing in Radio Advertising like suryan fm,redfm,big92.7fm,radio city,hello106.4fm.we are provides all types of online radio advertising.http://eumaxindia.com/radio-advertising-agencies-in-chennai/

    ReplyDelete

Post a Comment