పిసినారి రంగమ్మ!! | తెలుగు కథలు | Telugu Short Stories

సీతాపురం గ్రామంలో రంగమ్మ అనే ఒక పిసినారి ఉండేది. ఆమె ఎంత పిసినారి అంటే, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలదు. రంగమ్మ పిసినారి తనం గురించి తన వీధిలో వారికి, ఊళ్ళో వాళ్లందరికీ తెలిసిపోయింది. రంగమ్మ పిసినారి బుద్ధి తెలిసి ఎవరు చిన్న సహాయం కూడా అడిగేవారు కాదు.

         అయితే రంగమ్మ చాకలి వాళ్ళకి బట్టలు వేసేటప్పుడ్డు చిట్టా రాసుకోవడానికి పెన్ను, పేపర్ అవసరమైంది. అప్పుడు రంగమ్మ తన కూతురుని పిలిచి , పక్కింట్లో వాళ్ళని అడిగి పెన్ను, పేపర్ తీసుకురమ్మంది. వాళ్ళు లేదని చెప్పేసరికి వెనక్కి వచ్చి, తల్లితో చెప్పింది. అప్పుడు ఎదురింటి వాళ్ళని అడగమంది. వాళ్ళు కూడా లేదనే సరికి వెనక్కి వచ్చేసింది రంగమ్మ కూతురు. ఇంక ఎవ్వరు ఇవ్వకపోయేసరికి , తన ఇంట్లో బీరువా అరలో వున్నా పెన్ను, పేపర్ ని తీసుకురమ్మని చెప్పింది. అది విన్న రంగమ్మ కూతురు మన ఇంట్లోనే పెన్ను, పేపరు పెట్టుకొని అందరింటికి వెళ్లి అడగమన్నావెందుకు అని అడిగింది. అప్పుడు రంగమ్మ మన ఇంట్లో వున్న పెన్నులో ఇంకు అయిపోతే మల్లి కొనాలి అనవసర ఖర్చు అంటూ నసిగింది. అది విన్న రంగమ్మ కూతురు షాక్ అయ్యింది...ఇలాంటి వాళ్ళని మార్చలేం అనుకుంటూ పెన్ను, పేపర్ తేవడానికి ఇంట్లోకి  వెళ్ళింది. రంగమ్మ కూతురు....

"తనదగ్గర వున్న వస్తువు జాగ్రత్తగా ఉండాలి, అవసరానికి పనులు జరగాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. "

Comments