The Life of Indira Nehru Gandhi Book in Telugu

కేథరిన్ ఫ్రాంక్ రాసిన " The Life of Indira Nehru Gandhi Book " పుస్తకం :


" The Life of Indira Nehru Gandhi " అనే పుస్తకాన్ని క్యాథెరిన్ ఫ్రాంక్  రచించారు. ఇందులో ఆమె ఇందిరా గాంధీ , ఫిరోజ్ మధ్య వున్న సంబంధం గురించి రాసారు. అంతే కాకుండా ఇందిరా వ్యక్తిగత జీవితం గురించి, చాలా విషయాలనే ప్రస్తావించారు. సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి విషయాలు జరిగాయి అన్న విషయాలు క్లుప్తంగా రాసారు. అంతే కాకుండా సంజయ్ గాంధీ మరణం , తర్వాత మేనక గాంధీతో ఇందిరా గాంధీకి వున్న గొడవల గురించి కూడా రాసారు. అంతే కాకుండా సంజయ్ గాంధీ ని ఒక విల్లన్ లా అభివర్ణించారు. అతను చాలా కోల్డ్ బ్లడెడ్ అని, చెడువ్యసనాలకి బానిస అని , భయంకరమైన అవినీతి పరుడు అని, హంతకుడు అని పుస్తకంలో రాసింది .

        కేథరిన్ ఫ్రాంక్ నెహ్రు - గాంధీ కుటుంబలో రాజీవ్ గాంధీ మరియు , సోనియా గాంధీలను మాత్రమే మంచివారిగా వర్ణించారు. ఈ పుస్తకంలో నెహ్రు - గాంధీ కుటుంబం గురించి ఎక్కువ నెగటివ్ షేడ్స్ ఉండటం వలన , దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడటమే కాకుండా, వారి కుటుంబ గౌరవం మీద కూడా పడుతుందని భావించి ఈ పుస్తకాన్ని ఇండియాలో నిషేధించారు. కానీ చిన్న కాపీలు దొరికే అవకాశం ఉంది.
       
కానీ కాథెరిన్ రాసిన పుస్తకంలో వాస్తవాలు లేవని, ఆమె నిజానిజాలు తెలుసుకోకుండా , కేవలం గాంధీ - నెహ్రు కుటుంబంపై వచ్చిన పుకార్లను బేస్ చేసుకుని రాసిందని చాలా మంది ఈ పుస్తకాన్ని వ్యతిరేకించారు. కేవలం వారి కుటుంబాన్ని చెడుగా చూపటానికి మాత్రమే ఈ పుస్తకం రాసిందని , ఆమె రాసింది నిజమైతే సాక్ష్యాలు చూపించాలని , అవన్నీ నిజాలు కాదు కాబట్టి ఆమె వాటికి ఆధారాలు చూపించలేదని , కాబట్టి ఈ పుస్తకంలో ఆమె రాసిన విషయాలను నమ్మనవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు.

           


Comments