Bhopal gas tragedy in Telugu

భోపాల్ గ్యాస్ దుర్ఘటన

       పరిశ్రమలు అభివృద్ధికి సూచికలు. కాని నాణానికి రెండో వైపు చూస్తే భద్రతాచర్యలు
పాతించడం లో నిర్లక్ష్యం, వాయు కాలుష్యం విడుదల చేయడం లో బాధ్యతారాహిత్యం
కనిపిస్తాయి. డిసెంబర్ 2, 1984 నాడు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో సుమారు 3 వేల మంది
మరణించారు. 5 వేల మంది మ్రుత్యు ముఖం లోకి   నెట్టివేయబడ్డారు . ఇదే కాకుండా వేలకొలది
పశువులు, పక్షులు, పిల్లులు మరణించాయి. ఈ దుర్ఘటన యూనియన్ కార్బైడ్ యాజమాన్యం
నడుపుతున్న క్రిమిసంహారక మందుల తయారీ కర్మాగారం నుండి వెలువడిన
మిథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది. మానవుని తప్పిదాల
వల్ల వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. ఇది వాయు కాలుష్యం
వల్ల జరిగిన మరిచిపోలేని అత్యంత ఘోరమైన దుర్ఘటన.ఇన్ని దశాబ్దాలు గడిచినా అక్కడి
ప్రజలు, వాతావరణం పై ఆ దుర్ఘటన ప్రభావం ఇంకా ఉంది. వారి ఆరొగ్యంపై దుష్ప్రభావం చూపుతూనే ఉంది.

Comments