Paper Recycling in Telugu

వార్తాపత్రికలతో రీసైకిల్డ్ కాగితాన్ని తయారుచేయడం:

కావలసిన వస్తువులు:
రెండు ప్లాస్టిక్ తొట్టెలు, కర్ర గరిటె, నీరు, శుభ్రమైన నూలు దుస్తులు, పాత వార్తాపత్రికలు, వైర్ స్క్రీన్ , కొలపాత్ర, ప్లాస్టిక్ చుట్ట, బ్లెండర్, బరువైన పుస్తకాలు, రోలర్


తయారీ పద్దతి:
కత్తిరించిన న్యూస్ పేపర్ ముక్కలను నీటితో నిండిన తొట్టెలో వేసి ఒక రోజు నానబెట్టాలి. పిండి రుబ్బే బ్లెండర్ లో రెండు కప్పుల నానబెట్టిన కాగితం. ఆరు కప్పుల నీటిని చేర్చండి.
మెత్తని గుజ్జు తయారయ్యేలా రుబ్బి శుభ్రమైన తొట్టెలో వేయాలి. తొట్టెను ¼ వ వంతు నూరిన పేపర్ గుజ్జు మిశ్రమం తో నింపాలి. పొడిగా బల్లపరుపుగా ఉన్న తలంపై ఒక గుడ్డను పరచాలి.
తడి పేపర్ గుజ్జు కొంద వైర్ స్క్రీన్ ను ఉంచాలి. మెల్లగా బయటికి తీసి పేపర్ గుజ్జును ఒత్తుతూ అందులోని నీటిని తీసివేయాలి. జాగ్రత్తగా వస్త్రంపైన స్క్రీన్ ను బోర్లించాలి. గట్టిగా కిందకి ఒత్తి స్క్రీన్ ను తీసివేయాలి..కాగితపు గుజ్జు మిశ్రమంపై మరో గుడ్డను పరచాలి. గుడ్డపై ఒక ప్లాస్టిక్ షీట్ ను పరిచి దానిపై


    బరువు కోసం పుస్తకాలను పేర్చాలి. కొన్ని గంటల తరువాత పుస్తకాలు, గుడ్డను తీసి పేపరును ఎండలో ఆరనివ్వాలి.హేర్ డ్రయర్ ను ఉపయోగించి కూడా పేపరును ఆరబెట్టవచ్చును. రంగులు గల పేపరును తయారుచేయడానికి కాగితపు గుజ్జుకు వంటకాల్లో ఉపయోగించే రంగు చుక్కలను కలపాలి. ఏర్పడిన కాగితాన్ని ఇస్త్రీ చేసి కావలసిన పరిమాణం లో , ఆకారం లో కత్తిరించుకోవాలి. అందమైన గ్రీటింగ్ కార్డులు, ఫైల్ కవర్లు, బ్యాగులు మొదలైనవి రీ సైకిల్డ్ పేపరును ఉపయోగించి తయారుచేయవచ్చును.















Comments