Types of Vitamins in Telugu

విటమిన్ A ( రెటినాల్ ) :


ఆహార పదార్థాలు:
ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్


విటమిన్ ఎ లోపిస్తే కలిగే వ్యాధులు:
కన్ను, చర్మం సంబంధిత వ్యాధులు

వ్యాధి లక్షణాలు:
రేచీకటి, చత్వారం, కండ్లు పొడిబారటం, చర్మం పొలుసు బారటం , నేత్ర పటల సమస్యలు


విటమిన్ బి 1 ( థయామిన్ ):

ఆహార పదార్థాలు:
తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు

విటమిన్ బి1 లోపిస్తే కలిగే వ్యాధులు:
బెరిబెరి

వ్యాధి లక్షణాలు:
వాంతులు, ఆకలి లేకపోవడం, పక్షవాతం, మూర్ఛ , శ్వాసలో ఇబ్బందులు

విటమిన్ బి 2 ( రైబోఫ్లోవిన్ ):

ఆహార పదార్థాలు:
పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు

విటమిన్ బి 2 లోపిస్తే కలిగే వ్యాధులు:
గ్లాసైటిస్

వ్యాధి లక్షణాలు:
నోటిపూత, పెదవులు చివరలో పగలటం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం

విటమిన్ బి 3 ( నియాసిన్ ):

ఆహార పదార్థాలు:
మూత్రపిండాలు, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజలు


విటమిన్ బి 3 లోపిస్తే కలిగే వ్యాధులు:
పెల్లాగ్రా

వ్యాధి లక్షణాలు:
చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు , జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసుబారటం

విటమిన్ బి 6 ( పైరిడాక్సిన్ ) :

ఆహార పదార్థాలు:

తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం


విటమిన్ బి 6 లోపిస్తే కలిగే వ్యాధులు:
అనీమియా

వ్యాధి లక్షణాలు:
వాంతులు, మూర్చ

విటమిన్ బి 12 ( సయనోకోలమిన్ ):

ఆహార పదార్థాలు:
జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేశిస్తుంది

విటమిన్ బి 12 లోపిస్తే కలిగే వ్యాధులు:

పెర్నీషియస్ , అనీమియా

వ్యాధి లక్షణాలు:
నిస్సత్తువ, ఆకలి మందగించడం

విటమిన్ సి ( ఆస్కార్బిక్ ఆమ్లం ) :

ఆహార పదార్థాలు:

ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు

విటమిన్ సి లోపిస్తే కలిగే వ్యాధులు:
స్కర్వీ

వ్యాధి లక్షణాలు:
గాయాలు మానకపోవడం, ఎముకలు విరగటం

విటమిన్ D ( కాల్సిఫెరాల్ ):

ఆహార పదార్థాలు:

కాలేయం, గుడ్లు కార్డ్ లివర్ ఆయిల్, షాక్ లివర్ ఆయిల్, ఉదయపు ఎండ


విటమిన్ డి లోపిస్తే కలిగే వ్యాధులు:
రికెట్స్ 

 వ్యాధి లక్షణాలు:

ఎముకలు సరిగా పెరగకపోవడం, ఎముకలు పెళుసు బారటం , ముంజేతివాపు, దొడ్డికాళ్లు, దంత సమస్యలు

విటమిన్ E ( టోకోఫెరాల్ ):

ఆహార పదార్థాలు :

పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు ,పొద్దుతిరుగుడు నూనె


విటమిన్ E లోపిస్తే కలిగే వ్యాధులు :

వంధ్యత్వం సమస్యలు


వ్యాధి లక్షణాలు:

పురుషులలో వంధ్యత్వం,  స్త్రీలలో గర్భస్రావం సమస్యలు

విటమిన్ కె (ఫైలోక్వినైన్ ):

ఆహార పదార్థాలు:

మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు


విటమిన్ కె లోపించడం వల్ల కలిగే వ్యాధులు:

రక్తం గడ్డ కట్టక పోవడం


వ్యాధి లక్షణాలు:

అధిక రక్త స్రావం రక్తం గడ్డ కట్టక పోవడం


Comments