pesarattu preparation in Telugu

అల్పాహారాలలో పెసరట్టు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. చాలా మంది పెసరట్టు ను చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా పెసరట్టు లో అనేక పోషకాలు ఉన్నాయి.  పెసరట్టు తయారుచేసే పద్దతి కూడా చాలా సులభం. ఇప్పుడు పెసరట్టు ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు:

పెసలు    : 1 కప్పు 

బియ్యం  : 2 టేబుల్ స్పూన్లు 

అల్లం     :  కొద్దిగా

జీలకర్ర  : అర టేబుల్ స్పూన్ 

పచ్చిమిరపకాయలు : 3

ఉప్పు     : తగినంత 

నూనె     : కొద్దిగా

తయారీచేయు విధానం :


పెసరపప్పును , బియ్యాన్ని గిన్నెలోకి తీసుకొని నీటిలో అయిదు గంటల పాటు నానబెట్టాలి ( బియ్యం తప్పనిసరి కాదు. వద్దు అనుకునే వాళ్ళు బియ్యం లేకపోయినా పరవాలేదు. బియ్యం వేసుకోవడం వల్ల అట్టు క్రిస్పీ గా ఉంటుంది. ) బాగా నానిన తర్వాత మిక్సి జారులోకి తీసుకొని దానిలో కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు , ఉప్పు వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పిండిని  దోసపెనంపై అట్టులాగా వేసుకోవాలి. అట్టుపై  ఒక స్పూను నూనె  వేయాలి. అట్టు ఒకవైపు కాలాక మరొక వైపు కూడా వేడి చేసుకోవాలి అంతే చాలా రుచికరమైన పెసరట్టు తయారైనట్లే....

పెసరట్టులోకి  అల్లం పచ్చ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్. పల్లీల పచ్చడి  కూడా బావుంటుంది. 




Comments