hai raama song telugu lyrics rgv rangeli

హాయ్ రామ నువ్వు ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

ఇంట బయట నన్ను వెంటాడే నీ కన్ను
మాటే విననంటున్నది
పోనీలే అనుకుంటే ఇంకా ఇంకా అంటూ
తెరలే దాటొస్తున్నది
నా కళ్ళతోటి నీ అందం
నువ్వే చూడు ఒకసారి
నాలాగే నీకు నిలువెల్లా రాదా ఆవిరి

హాయ్ రామ నువ్వు ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

నాదే తప్పా అంతా నేనేం చేశా అంత
నేరం మరి నీదేకదా
వేళాపాళ లేక వేడెక్కిస్తూ ఇట్టా
దూరం అంటే ఎలా
ఆపొద్దు నన్ను అల్లరిగా మరీ అంత ఆకలిగా
లాగొద్దు ఒడికి తుంటరిగా
ప్రాణం తీయక

హాయ్ రామ నువ్వు ఊరికే ఉడికిస్తావే నన్నిలా
వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా
చాల్లే ఆ చూపులేంటి సిగ్గేస్తోంది.
అదిగో ఆ లయలు చూసే మతిపోతోంది

రంగేళి సినిమా పాట లిరిక్స్ - ఏమిటో ఏమో ఈప్రేమ

Comments