- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నూహించి నీ మూర్తిగావించి
నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్
చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై
జూచితే దాతవై
బ్రోచితే దగ్గరమ్ బిల్చితే
తొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నూహించి నీ మూర్తిగావించి
నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్
చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై
జూచితే దాతవై
బ్రోచితే దగ్గరమ్ బిల్చితే
తొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి
వారిన్విచారించి సర్వేశు బూజించి
యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్
కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి
శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి
యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి
శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై
పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్
మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్‍దెచ్చి
సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్
రావణున్ జంపగా నంత లోకంబు
లానందమై యుండ నవ్వేళను
న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి
పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి
శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి
పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు
మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను
సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే
భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే
వానరాకార యోభక్త మందార
యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా
నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్
స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన
ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి
నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై
రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్
రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత
ఓంకార ఘీంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్
బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్
గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్
జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి
కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన
నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ
యన్‍చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో
యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే
నమోవాయుపుత్రా నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే
నమస్తే నమః
జై హనుమాన్
జై హనుమాన్
జై హనుమాన్
జై హనుమాన్
anjaneya dandakam lyrics
anjaneya dandakam lyrics in telugu
lord anjaneya songs lyrics in telugu
lord hanuman dhandakam lyrics in telugu
lord hanuman songs lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment