chiranjeevi real name,village, wife, movies

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల సినీనాడి. ఈయన డాన్స్ , నటనతో యావత్ సినీఅభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈయనని చూసి ఎంతో మంది సినిమా రంగంలోకి అడుగు పెట్టారో లెక్కలేదు.  కోట్లమంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం 

           మెగాస్టార్ చిరంజీవిగా  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈయన ఆగస్టు 22, 1955 వ సంవత్సరంలో మొగలితుర్రులో  జన్మించాడు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు ( నాగబాబు, పవన్ కళ్యాణ్, విజయ దుర్గ, మాధవి రావు ). చిరంజీవికి ముగ్గురు పిల్లలు ( సుష్మిత, రామ్ చరణ్, శ్రీజ )

            చిరంజీవి హాస్యనటుడు అల్లురామలింగయ్య కుమార్తె సురేఖతో ఫిబ్రవరి 20, 1980 లో వివాహం జరిగింది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిరంజీవి 1978లో పునాదిరాళ్ళు చిత్రంలో నటించారు. కథానాయకుడు కాకముందు కొన్ని ప్రత్యేక పాత్రలలో, ప్రతినాయకుడి పాత్రలలో నటించాడు. ఆ తర్వాత కథానాయకుడిగా అనేక చిత్రాలలో నటించాడు. తన సినిమా జీవితాన్ని పక్కన పెట్టి , రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. కానీ చిరంజీవికి సినిమా రంగంలో వచ్చిన ఆదరణ  రాజకీయాలలో దొరకలేదు. 10 సంవత్సరాల తరువాత ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" జీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 64 ఏళ్ల వయసున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. 

Comments