jonnavittula coffee dandakam lyrics in telugu

అనుదిన్నమ్మును కాఫీ ఎ అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లబించుటే గొప్ప లక్కు
అమృతమన్నది హంబక్కు అయ్యలారా
జై కాఫీ విష్వంతరమ్ములో ఉన్న బ్రహ్మాండ గోలాలలో
నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ
నాలుకతో నీకు జే జేలు పలికేము నానాటికీ
ఎర్లి మార్నింగులో నిద్రలేవంగనే
పాచి పన్లైనయున్ తోమగా
బెడ్ కాఫీ కోసము పెన్లాముపై
రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరి
బ్రష్ కాఫీష్వరి లెఫ్సుకేఫీశ్వరీ
జిహ్వకున్ షుద్ది చేకూర్చవే బ్రూకుబాండేశ్వరి
లోక ప్రాణేష్వరీ ప్రాణ దానేశ్వరి
గంట గంటా ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పాణేశ్వరి
స్టీలు ఫిల్టర్ల పల్లెంబులోనున్నరంధ్రాలలో నుండి
నీ సారమంత సుతారంగ జారంగ నోరూరుచూడంగ
నాసామి రంగా నిజంగానే  చచ్చేవిధంగా
కాస్త తాగంగ పునర్జన్మ వచ్చేవిదంగా
ప్రొద్దు పొద్దున్ననే నీ పొందులేకున్న
మూడంత పాడయ్యి టైమంత వేస్టయ్యి
కచ్చెక్కి పిచ్చెక్కి అస్లీల సంభాషనల్ చేసి
కాంటాక్ట్సు సర్వమ్ము నాషమ్ము కావించుకుంటారుగా
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకొంటారుగా
దాచుకొంటారుగ కాచుకొంటారుగ
చచ్చినట్టింక ఇచ్చేంత సేపింక అందరున్ వేచివుంటారుగా
కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి
ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచు నురుగు ఉప్పొంగగా ఇస్తారుగా
గొప్పనిష్టాగరిష్ఠుల్ భరిస్తాలలొ కనిష్ఠమంబుగా
కాఫీ తాగెందుకిష్టంబుగా పోవుగా
షాపు మూసెయ వాపోవుగా
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ సుభంగీ ప్రభంగీ
నమస్తే నమస్తే నమహా

Comments