sankranthi vachinde song lyrics in telugu



సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా
సరదాలు తెచ్చిందె తుమ్మెదా
కొత్త ధాన్యాలతో  కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుల్లతో కొంటె మరదల్లతో
పొంగే హేమంత సిరులూ

మంచి మర్యాదనీ పాపపుణ్యాలన్నీ
నమ్మే మన పల్లెటూల్లూ
న్యాయం మా శ్వాసనీ
ధర్మం మా బాటనీ చెపుతాయి స్వాగతాలూ
బీదా గొప్పోల్లనీ మాట లేదూ
నీతి నిజాయితీ మాసిపోదూ
మచ్చ లేని మనసు మాది
మంచి తెలుసు మమత మాది
ప్రతి ఇల్లు బొమ్మరిల్లూ

సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా
సరదాలు తెచ్చిందె తుమ్మెదా

పాటే పంచామృతం మనసే బృందావనం
తడిసేనె వళ్ళు జల్లూ
మాటే మకరందమూ చూపే సిరి గంధమూ
చిరునవ్వే స్వాతి జల్లూ
జంటా తాళాలతో మేజువాణీ
జోడూ మద్దెల్లనీ మోగిపొనీ
చెంత కొస్తే పండగాయె
చెప్పలేని బంధమాయె వయసే అల్లాడిపోయే

సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా
సరదాలు తెచ్చిందె తుమ్మెదా
ఓయ్
కొత్త ధాన్యాలతో  కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుల్లతో కొంటె మరదల్లతో
పొంగే హేమంత సిరులూ



Comments