karigeloga ee kshanam song lyrics in telugu from aarya movie



కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం 

కలలే జారే కన్నీరే చేరగా 

గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ


కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం 

కలలే జారే కన్నీరే చేరగా 



పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను

ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను

నిదురను దాటి  నడిచిన ఓ కల నేను

ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను

నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ

నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ 

నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ

ఉంటే  విడదీసే వీలుందా..ఓ..ఓ..



కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం 

కలలే జారే కన్నీరే చేరగా 


అడిగినవన్నీ కాదని పంచిస్తూనే

మరు నిమిషంలో అలిగే పసివాడివిలే

నీ పెదవులపై పాడని నవ్వులు పూలె

నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటని చూస్తుంటే....ఓ

నా బాదెంతటి అందంగా వుందే..ఓ..ఓ ..

ఈ క్షణమేనూరేళ్లవుతానంటే ..ఓ

మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..


కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం

శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా

కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం 

కలలే జారే కన్నీరే చేరగా 

గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ

ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

Comments