- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
తిన్న తీరం బడుతలే
కూసున్న తీరం బడుతలే
యడున్నా తీరం బడుతలే
ఎవలున్న తీరం బడుతలే
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
నువ్వు సిర్రా సిటీక వట్టి
డప్పుల ధరువులేస్తే
తనువంతా కాటగలిసె
ప్రేమ ఈత్తు నాలు మొలిసే
గప్పటి నుండే నాకు తిప్పల మొదలయేనుల్ల
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
నువ్వు నేను దూరమాయీ
యాడాది నర్థమొయీ
పొద్దు మాపు ఏదురు సూపు
జాడన్న తెలువదోయీ
ఇట్లా గోసలు వెట్ట నీకెట్లా మనసాయే పిల్లగా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
రవ్వంత దూసులాట
అగ్గోలె రాజుకుంది
ఈగ మాట మాట వేరిగే
ఇద్దరి మనసు విరిగే
కొవ్వొత్తి వోలే కరిగే
కోపాలు ఎందుకోయ్ పిల్లగా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
పసిదాన్ని కాదా నేను
పగ బట్ట బోకు నన్ను
పంతాలు ఇడుసవెట్టు
ఇక నన్న చేయివట్టు
నా గుండెల బాధ
నీ గుండెకు గుర్తొస్తలేద
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
బాధయితుందే నీ యాదిల మనసంతా
మస్త్ బరువైతుందే నీ యాదిల మనసంతా
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment