raama kanavemiraa song lyrics in telugu



రామ కనవేమిరా రామ కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా 
రామ కనవేమిరా 
రమణీలలామ నవలావణ్యసీమ 
ధరాపుత్రి సుమగాత్రి 
ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ
రామ కనవేమిరా

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగ
శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమయ్యా అనుకుంటున్నారట 
తమలో సీతమ్మ అనూంగు చెలికత్తెలు
రామ కనవేమిరా రామ కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా 
రామ కనవేమిరా

ముశి ముశి నగవుల రసిక శిఖామణులు
 సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదౄస ధిక్రములు 
సగరిగ మనిదమని
ముశి ముశి నగవుల రసిక శిఖామణులు
తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదౄస ధిక్రములు 
తకఝణు తకధిమితక
మీసం మీటే రోషపరాయణులు నీ.దమ పమా.గరిగమ
మాదరి ఎవరను మత్తగులోల్మణులు అహా..
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక సివధనురు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామ కనవేమిరా కనవేమిరా
కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు ఓ వరుడు
తొడగొట్టి ధరువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు ఓ వరుడు 
తొడగొట్టి ధరువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు 
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొఖమెత్తాలెక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళూ వొరిగి రెండు కళ్ళూ తిరిగె వొగ్గేసిన పురుషాఘనులు
ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
ఆ ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అరెరెర్రెరె ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అహ ఎత్తేవారు లేరా అ విల్లు ఎక్కుపెట్టే వారు లేరా 
తకతయ్యకు తాధిమితా

రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు 
ఆవింటి మీదా చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు 
ఆవింటి మీదా చెయ్యి వేసినాడు
సీతవంక వోరకంట చూసినాడు
 సీతవంక వోరకంట చూసినాడు.
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ..
పెళ పెళ.. 
విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు
జయ జయ రామ  రఘుకుల సోమ
జయ జయ రామ  రఘుకుల సోమ
దశరధ రామ దైత్యవిరామ
దశరధ రామ దైత్యవిరామ
జయ జయ రామ  రఘుకుల సోమ
జయ జయ రామ  రఘుకుల సోమ
దశరధ రామ దైత్యవిరామ
దశరధ రామ దైత్యవిరామ

సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే

రామయ్యా అదిగోనయ్య 
రమణీలలామ నవలావణ్యసీమ 
ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ
రామ కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా 
రామ కనవేమిరా 

మాంగళ్యం తంతునానేనా
మమజీవన హేతునా
కంటే బధ్నాని సుభగే
సంజీవ శరదాం శతం

Comments