adigi adagaleka song lyrics in telugu

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా 
ఆశగ అడగనా నీ అడుగునై అడగనా 
మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా 
ఎన్ని జన్మలైన జంట వీడరాదనీ 

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా 

నీకన్న మెత్తనిది నీ మనసే నచ్చినదీ 
నీకన్న వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ 
పెదవి కన్న ఎద తీయనిదీ 
కనులకన్న కద అల్లనిదీ 
నువ్వు కన్న సిగ్గే నాన్యమైనదీ 
జన్మ కన్న ప్రేమే నమ్మికైనదీ 
ఎన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ 

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా 

నీకన్న చల్లనిది నీ నీడే దొరికిందీ 
నీకన్న నిజమైంది నీ తోడే నాకుంది 
సొగసు కన్న ఒడి వాడనిదీ 
బిగుసుకున్న ముడి వీడనిదీ 
ముల్లు లేని పువ్వే ప్రేమ అయినదీ 
పూలు లేని పూజే ప్రేమ అన్నదీ 
యే జన్మలోన ప్రేమ పూజ మానరాదనీ 

అడిగీ అడగలేక ఒక మాటే అడగనా 
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా 
ఆశగ అడగనా నీ అడుగునై అడగనా 
మౌనమై తెలుపన నీ దానినై తెలుపనా 
బాస చేసుకున్న మాట మార్చరాదనీ

Comments