- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు
నీ మనస్సే నొప్పించానంటే క్షమించు
దయచేసి ఎక్స్ క్యూజ్ మి
దరిచేరి ఫర్గీవ్ మి
ఒకసారి బిలీవ్ మి
ఒహో హోహోహో ఒహో హో హోహో
మాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే
నిదానించి బతిమాలాయి క్షమించు
పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలే
తలొంచేసి నుంచున్నాయి క్షమించు
చూపుల లోపల కలిగిన మార్పుని సూటిగ గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగుని నేరుగ గుర్తించు
హృదయం అంతట నిండిన ప్రతిమను దర్శించు
ఆపైన ఆలోచించు
నిజంగా ఒహో క్షమించు నిజంగా క్షమించు
తగాదాలే చెలిమికి నాంది విభేదాలే ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించు
తపించేటి ఈ పాపాయిని వరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించు
పిడికెడు గుండెను చేకొని బోలెడు భారం తగ్గించు
ఇరువురి నడుమన ఇంతకు ఇంత దూరం తొలగించు
అణువణువణును మమతల చెరలో బంధించు
వందేళ్ళు ఆనందించు
నిజంగా ఒహో క్షమించు
నిజంగా క్షమించు
ల ల ల లాలాలాల క్షమించు
ల ల ల లాలాలాల క్షమించు
దయచేసి ఎక్స్ క్యూజ్ మి
దరిచేరి ఫర్గీవ్ మి
ఒకసారి బిలీవ్ మి
ఒహోహోహో ఒహోహోహో
మాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
nijamga cheppalante kshaminchu song lyrics in telugu
nijamga cheppalante song lyrics in telugu
nijamga cheppalante song lyrics in telugu from devadas movie
ram nijamga cheppalante song lyrics
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment