ninna kuttesinadhe song lyrics in telugu

మొన్నా కుట్టేసినాది నిన్న కుట్టేసినాది 
మళ్ళీ కుట్టేసినాది గండు చీమ
మొన్నా కుట్టేసినాది నిన్న కుట్టేసినాది 
మళ్ళీ కుట్టేసినది గండు చీమ 
నువు తిడత తిడతా ఉన్నా 
అది కుడత కుడతా ఉంటే 
నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యొ 

మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె 
పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ 
నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే 
ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ 

నీ బింకం  చూస్తే హాయ్ హాయ్ హాయ్ 
ఆ సొంపును చూస్తే హాయ్ హాయ్ హాయ్ 
నా గుండెల్లోనా హాయ్ హాయ్ హాయ్ 
ఉబలాటం పెంచేనే అమ్మాయో 
ఓ ప్రియుడా ఏ నాడు అన్నానా 
చెయి పడితే చేయి జారి పోతానా 
నువు కులుకుతు సై సై అంటె 
నే  తకదిమి తాళం వేస్తే 
నీ చీరలె నడువొంపులో పడతానే  పసి బొమ్మ 

మొన్నా కుట్టేసినాది నిన్న కుట్టేసినాది 
మళ్ళీ కుట్టేసినది గండు చీమ 
నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే 
ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ 

పగలంతా ఒకతే గిలిగింత 
రాత్రయ్యిందంటే తుళ్ళింతా 
ఒళ్ళంతా తడిమితే  పులకింత 
కుట్టేస్తా ఉంది తనువంత 
నీ పరువం బరువెక్కిపోతె లలనా 
ఈ చలిలో కాటెక్క  ఉండగలనా 
నా సొగసులు చిందేస్తుంటే 
నీ మగసిరి రంకేస్తుంటే 
తెల్లార్లు సైయ్యాటలే 
సరసాలు బుల్లోడా 

మొన్నా కుట్టేసినాది నిన్న కుట్టేసినాది 
మళ్ళీ కుట్టేసినది గండు చీమ 
మొన్న కుట్టేసి మళ్ళి నిన్న కుట్టేసిందంటె 
పిల్లా నువ్వంటె దాని కెంత ప్రేమొ 
నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతాకుడతా ఉంటే  
ఏ తీపి వస్తువు యాడ దాస్తివొ ఎవ్వరికెరుకమ్మొ

Comments