seetimaar title song lyrics in telugu

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి  పొద్దు తిరుగుడు పువ్వా
మా పాపికొండల నడుమ  రెండు జెల్లేసిన చందమామ నువ్వా
మలుపు మలుపూలోన గలగల పారేటి  గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు  పచ్ఛా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా

సీటిమార్ మార్ మా
సీటిమార్ మార్ మార్ 
సీటిమార్ మార్ మార్
కొట్టు కొట్టూ ఈలే కొట్టు
ఈలే కొట్టు ఈలే కొట్టు
ప్రపంచమే వినేటట్టు  వినేటట్టు వినేటట్టు
దించితేనే అడుగులు ఈ నేల గుండెపై
ఎదుగుతావు చిగురులా
ఎత్తితేనే నీ తల
ఆకాశం అందుతూ
ఎగురుతావు జెండాలా
గెలుపే నడిపే బలమే గెలుపే

కబడ్డి కబడ్డి కబడ్డి  కబడ్డి కబడ్డి కబడ్డి
సీటిమార్ సీటిమార్ 
సీటిమార్ సీటిమార్ 
ఓయెఓ ఓయెఓ ఓయె ఓ ఓ ఓ  ఓ ఓ ఓ
ఓయెఓ ఓఓ ఓఓ
ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ
ఓయెఓ ఓఓ ఓఓ  ఓ ఓ ఓ

అలా పట్టుపావడాలు
నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా
చలో ముగ్గులేసె చెయ్యి నేడు
బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్నసోట ఉండిపోక అలాగ 
చిన్నదైనా రెక్క విప్పే తూనీగ
లోకమంత చుట్టు గిరగిరా
కబడ్డి కబడ్డి కబడ్డి  కబడ్డి కబడ్డి కబడ్డి
సీటిమార్ 
సీటిమార్
సీటిమార్ 
సీటిమార్

కబడ్డి కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దున
కబడ్డి కాంచన దూది మెత్తన
పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్
చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు

సదా ధైర్యమే నీ ఊపిరైతే  చిమ్మచీకటైనా వెన్నెలేగా
పదా లోకమేసే రాళ్ళనైనా మెట్లు చేసి నువ్వు పైకి రాగా
జంకు లేక జింకలన్నీ ఇవ్వాలే
చిరుతనైనా తరుముతుంటే సవాలే
చెమట చుక్క చరిత మార్చదా
కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి కబడ్డి
సీటిమార్ 
సీటిమార్
సీటిమార్ 
సీటిమార్

Comments