chirunavve navvuthu song lyrics in telugu

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ 
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ 
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాదీస్తూ 
ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby 

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ 
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ 

నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా 
పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా 
పువ్వే ముళ్ళయి కాటేస్తోందా 
నీరే నిప్పయి కాల్చేస్తోందా 
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా 
నీకోసం నిరీక్షణా ఓఓ I am waiting for you Baby 
ప్రతి జన్మ నీతోనె I am waiting for you Baby 

ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా 
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా 
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా 
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా 
నీకోసం నిరీక్షణా ఓఓ I am waiting for you Baby 
చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ 
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ 
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ 
నిలుచున్నానే నీకై వేచే ప్రియానే ఆరాదీస్తూ 
ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby
ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby

Comments