inka edho song lyrics in telugu| darling movie

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు 
సంకెళ్ళతో బంధించకు 
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు 
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం 
అనుకుందేదీ నీలోనే నువు దాచకు 
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా 
కనిపించాక మౌనాన్నే చూపించకు 
ఇంకా ఏదో ఇంకా ఏదో 
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు 

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ 
జాబిల్లి చల్లేనా జడివాననీ 
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ 
నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ 
తీరమే మారినా తీరులో మారునా 
మారదూ ఆ ప్రాణం 
ఇంకా ఏదో ఇంకా ఏదో 
ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు 

వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ 
లోలోన దాగుంటే ప్రేమవ్వదూ 
అమృతం పంచడం నేరమే అవదురా 
హాయినే పొందడం భారమే అవదురా 
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా 
ఇప్పుడే ఆ అందం 

ఇంకా ఏదో ఇంకా ఏదో 
ఇడి పోతావే ఇష్టాలే తెలిపేందుకు 
సంకెళ్ళతో బంధించకు 
ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు 
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం 
అనుకుందేదీ నీలోనే నువు దాచకు 
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా 
కనిపించాక మౌనాన్నే చూపించకు

Comments