kurrayeedu song lyrics in telugu| ramayya vasthavayya

ఒంటరేళ్ళ తుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు
గండుచీమలాగ నన్ను కుట్టినాడు 
బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు 
బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు 
చందనాల చక్కలాంటి చక్కనైన పిల్లా 
చాందినీల చుక్క సిగ్గుకెక్కిపొతే ఎల్లా 
చంపకేసి అద్ధ ముద్దు పావడాల పిల్లా 
చేతిలోంచి జారిపోకే ఓసి సబ్బు బిల్లా 
నేతి అరిసెలా మూల బరిసెలా 
సానబట్టి సూది కళ్ళు గుంటలోన గుచ్చమాకలా
గుచ్చమాకలా గుచ్చమాకలా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి 
గుంజుతుంటే గింజుకోవా ఆశలన్నీ 
పాతికేళ్ళ మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు 
చేసుకోవే జిల్లుమన్న దిల్లు బోణి 
హెయ్ 

పావుగంట కౌగిలిస్తే తియ్యగా 
హెయ్ పావుసేరు తేనెకైన అంత తీపి లేదుగా 
ఎక్కడో తలుక్కుమంది పిల్లగా హెయ్ 
పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా 
లేడి కళ్ళ చిన్నదాన్ని వాడి చూపులేసి
ప్రేమతోటి కుట్టినావుగా 
గాజుబొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండ 
ప్రాణమేసి పట్టినావుగా
సిగ్గుపడకలా నెగ్గిన్నావే పిల్ల
చిలిపి చిలకల కలికి కులుకుల
జారుతున్న దోర గుండె కోరి కోరి కొరకమాకలా
కొరకమాకలా కొరకమాకలా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి 
గుంజుతుంటే గింజుకోవా ఆశలన్నీ 

ఎక్ డోల్ డోల్ డోల్ డోల్ నా
పరికిణీల చందమామ పరిణయం కోరిన
ఎక్ డోల్ డోల్ డోల్ డోల్ నా
చుక్క లాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగినా
పొయ్యి మీద పాలకుండ  పొంగి పొరలి పోయె 
పండగేదో ముందరుందనా 
పక్కమీద సన్నజాజి పువ్వులే జల్లే 
సంగతేదో సణుగుతోందనా
సొగసు సంకెల విసరకే పిల్లా
కొసరు నదుముతో యెసరు ముసరగా
నా తస్సాదియ్య కస్సుమన్న కన్నెతోడు కన్నుకొట్టగా
కన్నుకొట్టగా  కన్నుకొట్టగా
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి 
గుంజుతుంటే గింజుకోవా ఆశలన్నీ 
పాతికేళ్ళ మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు 
చేసుకోవే జిల్లుమన్న దిల్లు బోణి 

Comments