lalu darwaja song lyrics in telugu

హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా 
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా 
ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైన 
ఈ ప్రేమ గాద లొకటే ఊరువాడా లేవైనా 
గోవిందా గోవిందా ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా 
గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల 
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా 
అయితే ఇప్పుడు ఏమిటంటారురా 
లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ 
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ 
హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా 
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా 

కన్ననాడు అడిగామా పెంచటానికడిగామా 
గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినామా 
మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపామ 
కమ్మనైన మీ కన్న ప్రేమలో వంకలెతుకుతామా 
అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా 
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా 
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా 
వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమా 
అందుకే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ 
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ 
హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా 
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా 

వేణుగాన లోల వేగముగా రారా 
నిలిచెను ఈ రాధా నీ కోసమే 
వెన్నదొంగ రారా ఆలసించవేల 
పలికెను నోరారా నీ నామమే 
పొన్న చెట్టు నీడలోన 
కన్నె రాధా వేచి వుంది 
కన్నె రాధా గుండెలోన 
చిన్ని ఆశ దాగివుంది 
చిన్ని ఆశ దాగివుంది 

అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు 
ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు 
లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు
ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు 
ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు 
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు 
కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము 
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము 
లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ 
హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

Comments