mari anthaga song lyrics in telugu

మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకల
పనేం తోచక పరేషానుగ గడబిడ పడకు అల 
మతోయెంతగ శృతే పెంచగ విచారల విల విల 
సరే చాలిక అల జాలిగ తిక మక పెడితే ఎల 
కన్నీరై కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసేలా 
ముస్తాబె చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసేలా ఓ  
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 
కదా మరెందుకు గోల 
అయ్యయ్యొ పాపం అంటె ఏదో లాభం వస్తుందా 
వృధా ప్రయాస పడాల 
మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా 
సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల 

ఎండలను దండిస్తామ వానలను నిందిస్తామ 
చలినెతో తరమెస్తామ చీ పొమ్మని 
కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ 
రోజులత రాజీ పడమ సర్లేమ్మని 
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం 
పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఏం చెప్తాం 
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 
కదా మరెందుకు గోల 
అయ్యయ్యొ పాపం అంటె ఏదో లాభం వస్తుందా 
వృధా ప్రయాస పడాల 

చమటలేం  చిందించాల శ్రమపడేం పండించాల 
పెదవిపై చిగురించేల చిరునవ్వులు 
కండలను కరిగించాల కొండలను కదిలించాల 
చచ్చి చెడి సాధించాల సుఖశాంతులు 
మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు 
మనసులను తెరిచే హితవు వందేళ్ళయిన వాడని చిరునవ్వు 
ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా 
కదా మరెందుకు గోల 
అయ్యయ్యొ పాపం అంటె ఏదో లాభం వస్తుందా 
వృధా ప్రయాస పడాల 

Comments