nammaka thappani song lyrics in telugu

నమ్మక తప్పని నిజమైనా 
నువ్విక రావని చెబుతున్నా 
ఎందుకు వినదో నా మది ఇపుడైనా 
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా 
నువ్వేమో అనుకుంటున్నా 
నీ రూపం నా చూపులనోదిలేనా 

ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే వున్నా  
నువ్వొదిలిన ఈ  ఏకాంతంలోన 
కన్నులు తేరిచే వున్నా నువు నిన్నటి కలవే అయినా 
ఇప్పటికీ ఆ కలలోనేవున్నా 
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా 
ఎందుకు వినదో నా మది ఇపుడైనా 

నీ స్నేహం లో వెలిగే వెన్నేల్లో
కొన్నాళైనా సంతోషంగా గడిచాయనుకొనా 
నా ఊహల్లో కలిగే వేదనలో 
ఎన్నాళైనా ఈ నడి రాతిరి గడవదు అనుకోనా 
చిరునవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా 
చెయి జారిన ఆశల తొలివరమా 

నమ్మక తప్పని నిజమైనా 
నువ్విక రావని చెబుతున్నా 
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

నమ్మక తప్పని నిజమైనా 
నువ్విక రావని చెబుతున్నా 
ఎందుకు వినదో నా మది ఇపుడైనా 
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా 
నువ్వేమో అనుకుంటున్నా 
నీ రూపం నా చూపులనోదిలేనా 

Comments