nannodili needa vellipotunda song lyrics in telugu

నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా 
వేకువనే సందె వాలిపోతోందే
చీకటిలో ఉదయముండి పోయిందే 
నా యదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా 
పోవద్దె పోవద్దె ప్రేమా
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా

ఇన్ని నాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటోందే ఓఓ
నిన్నదాక నీ రూపం నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తుందే 
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే
జాలిలేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే బ్రహ్మనైనా అడిగేదొకటే
గనమంటా  మమ్ము తన ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా 
పోవద్దె పోవద్దె ప్రేమా
నువ్వుంటే నేనుంటా ప్రేమా 
పోవద్దె పోవద్దె ప్రేమా

Comments