nenu thaanani anukuntaara song lyrics in telugu

ఓహోహో ఓహోహో
ఓహోహో ఓహోహో 
ఓహోహో ఓహోహో 
 
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా 
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా 
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ తప్పుకుపోతారా
ఓహోహో ఓహోహో 
ఓహోహో ఓహోహో 

ఒక చోటే వుంటూ ఒకటే కలగంటూ 
విడివిడిగా కలిసే వుండే కళ్ళది ఏ బంధం 
కలకాలం వేంటే నడవాలనుకుంటే 
కాళ్ళకి ఓ ముడి వుండాలని ఎందుకు ఈ పంతం 
చుట్టరికముందా చెట్టుతో పిట్టకే హో
ఏం లేకపోతే గూడు కడితే నేరమా
ఎ చెలిమి లేదా గట్టుతో ఎటీకే హో 
వివరించమంటే సాధ్యమా 
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా 
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా 
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ తప్పుకుపోతారా

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తానున్నానన్న నమ్మం అంటారా
చెవులకి వినిపించే సవ్వడి చేయందే 
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా 
మదిలోని బావం మాటలో  చెప్పకుంటే 
అటువంటి మౌనం తగనిదంటూ అర్దమా
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే 
నిలిపే నిషేదం న్యాయమా
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా 
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా 
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ తప్పుకుపోతారా
ఓహోహో ఓహోహో
ఓహోహో ఓహోహో

Comments