reddy ikkada soodu song lyrics in telugu

వేయి శుభములు కలుగు నీకుపోయి రావే మరదలా 
ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగ లేములే 
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా 

రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తి సలబ చూడు 
చొరవా కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 
వరస కలిపే నేడు కురసా రైకల తాడు 
సరసాకు పిలిసి కట్టు పసిడి పుస్తల తాడు
 
వేట కత్తికి మీసం పెడితే నాకులాగే ఉంటాది 
పూల బొత్తికి ఓని చుడితే నీకు మల్లె ఉంటాది 
నువ్వు నేను జోడి కడితే సీమకే సెగ పుడతాది 
ఆల్ రెడీ నేన్ రెడీ అంటాందే నా తాకిడి 
మోజుగ మోతగా కూసిందే కోడి 
షర్ట్ గుండి ఫట్ అనేలా చేసే హడావిడి 
ఏటవాలు సూపులతోన గెలకమాకె సెంటు బుడ్డి 
పట్టు పరుపల పందిరి పక్క వెలగని సాంబ్రాణి కడ్డి 
యేడు తిరిగేలోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి 
రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తి సలబ చూడు 
చొరవా కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 

రాజా సారంగుడంటే అచ్చంగా వీడే 
రంగార సింగమల్లే దూకాడు చూడే 
దూకాడు చూడే 

అందమంతా గంధకమై రాజేస్తాండే రాపిడి హే
సూరెకారం సూపులతో ముట్టిస్తా వేడి 
సిసలైన బొండు మల్లె పూల రాయలోరి బండి 
పైటాకు పచ్చ జెండా చూసి ఆనకట్టు గండి 
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది 
టాప్ గా ఉన్నా కదా చెప్పుకో ఇబ్బంది 
నుదుట బొట్టున చెమట బొట్టై వేసై తడి ముడి … 
ఏటవాలు సూపులతోన గెలకమాకకె సెంటు బుడ్డి 
పట్టు పరుపల పందిరి పక్క ఎలగని సాంబ్రాణి కడ్డి 
యేడు తిరిగేలోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి 
రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తి సలబ చూడు 
చొరవా కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు 
వరస కలిపే నేడు కురసా రైకల తాడు 
సరసాకు పిలిచే కట్టు పసిడి పుస్తల తాడు

Comments