uriki utharaana song lyrics in telugu

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన 
నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి
సక్కానైనా పెద్దారెడ్డెమ్మ 
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన 
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన 
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి
గుండెలవిసి పోయె గదమ్మా 
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మ 
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మా 
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డెమ్మ తల్లి
సింధూరం బొట్టు పెట్టమ్మా 
కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా 
కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా 
కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి
కాచీమమ్ము బ్రోవు మాయమ్మా 
నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే 
నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే 
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యామైన పెద్ద రెడ్డెమ్మా 
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా

Comments