vaana chinukulu song lyrics in telugu

వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే 
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే 
అరె అబ్బాయంటే అంత అలుసే 
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని 
వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ ఆగుతుంది వయసే 
నీటి చురకలు అట్టా తగిలితే 
ఎట్టాగ లొంగుతుంది సొగసే

నీ వలన తడిసా నీ వలనా చలిలో చిందేసా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ
జారుపవిటని గొడుగుగ చేసానోయ్
అరె ఊపిరితో చలి కాసానోయ్ 
హే ఇంతకన్నా ఇవ్వదగ్గదేన్తదైనా ఇక్కడుంటే 
తప్పకుండ ఇచ్చితీరుతాను చెబితే
వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే 
ఎట్టాగ లొంగుతుంది సొగసే

సిగ్గులతో మెరిసా గుండె ఉరుములతో నిను పిలిచా 
ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేసా 
నీకు తొలకరి పులకలు మొదలైతే 
నా మనసుకి చిగురులు తొడిగాయే 
నువ్వు కుండపోతలాగా వస్తే 
బిందెలాగ ఉన్న ఊహ 
పట్టుకున్న హాయికింక లేదు కొలతే 

వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే 
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే 
అరె అబ్బాయంటే అంత అలుసే 
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని 
వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే

Comments