yevaru lerani anaku song lyrics in telugu

ఎవరూ లేరని అనకు
తోడుంటా నీ కడవరకు
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ 
ఎపుడూ ఒంటరి అనకు
నీతోనే చావో బ్రతుకు 
కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు 
ప్రేమతోటి చెంప నిమరనా 
గుండె చాటు బాధ చెరపనా 
నీ ఊపిరే అవ్వనా
గడిచిన కాలమేదో గాయపరిచినా 
జ్ఞాపకాల చేదు మిగిలినా 
మైమరిపించే హాయవ్వనా
ఒట్టేసి నేను చెబుతున్నా 
వదిలుండలేను క్షణమైనా 
నీ సంతోషానికి హామీ ఇస్తున్నా 

ఎవరూ లేరని అనకు
తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ 

నా మనసే నీకివ్వనా నీలోనే సగమవ్వనా 
అరచేతులు కలిపే చెలిమే నేనవనా 
ముద్దుల్లో ముంచేయనా కౌగిలిలో దాచెయ్యనా 
నా కన్నా ఇష్టం నువ్వే అంటున్నా 
తడిచొస్తే తల తుడిచే చీరంచుగ నేనే మారనా 
అలిసొస్తే ఎపుడైనా నా ఒడినే ఊయల చేస్తానంటున్నా 
ఎవరూ లేరని అనకు
తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ
 
నిను పిలిచే పిలుపవ్వనా నిను వెతికే చూపవ్వనా 
నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవనా 
నిను తలచే తలపవ్వనా నీ కథలో మలుపవ్వనా 
ఏడడుగుల బంధం నీతో అనుకోనా 
మనసంతా దిగులైతే నిను ఎత్తుకు సముదాయించనా 
నీకోసం తపనపడే నీ అమ్మా నాన్నా అన్నీ నేనవనా 
ఎవరూ లేరని అనకు 
తోడుంటా నీ కడవరకు 
చీకటిలోనా వెలుగౌతా నీకొరకూ

Comments