idhi kalala vunnadhe song lyrics in telugu

అరెరే ఇది కలలా ఉన్నదే 
హయ్యయో కానీ జరిగిన నిజమిదే 
నా కలలో అతను ఇదెలా నమ్మను 
నా జతలో తనను నేనెలా చూడను 
అసలేమవ్తుందో ఇంక ఇంక అర్ధమయ్యే లోపు 
సుడిగాలై నన్ను చుట్టేసిందే ఓ అందగాడి కనుచూపు 
అరెరే ఇది కలలా ఉన్నదే 
హయ్యయో కానీ జరిగిన నిజమిదే 

ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది 
హయ్యయయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది 
ఎన్నడు అడగంది ఎదురగ వచ్చింది 
ఈ నిజమూ నేను రాజిపడగ సమయం పడుతుంది 
జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది 
కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది
జనమంతా నన్ను యువరాణిల 
చూసే రోజు ముందుంది
అరెరే ఇది కలలా ఉన్నదే 
హయ్యయో కానీ జరిగిన నిజమిదే
 
అందరి వాడైన అందని వాడైన 
ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో వుంటాడే 
తనతో నేనేనా అనిపించే పనిలోన 
ఎప్పడికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే 
పరదా వీడని అతని మౌనం 
ఏమి మాట్లాడకున్న 
సరదా చిలికే అతని చూపు ప్రేమకే సూచనా 
మా మనసులు రెండు మాట్లాడందే ఇంత కధ జరిగేన 
అరెరే ఇది కలలా ఉన్నదే 
హయ్యయో కానీ జరిగిన నిజమిదే ఎయ్ 

Comments