- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ముసలి తాతా ముడత ముఖం
మురిసిపోయెనే మురిసిపోయెనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయెనే మెరిసిపోయెనే
రచ్చబండ పక్కనున్న
రాములోరి గుళ్ళో గంటా
రంగ రంగ సంబరంగ మోగెనే
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓఓ ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
కత్తి సుత్తి పలుగు పార తియ్యండి
మన కష్టం సుక్కలు కుంకుమ బొట్టుగ పెట్టండి
మన కష్టం సుక్కలుకుంకుమ బొట్టుగ పెట్టండి
ఓఓ ఓహో అన్నం పెట్టే పని ముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
అమ్మోరు కన్ను తెరిచిన నవరాతిరి
ఇన్నాళ్ళ సిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ
ఓఓ ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
ఓఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు
యే దారి గతుకులు చెబుతాయి పల్లె బ్రతుకుల చిత్రాలు
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లెవైపేగా
అస్సలైన పండగ ఎపుడంటే
ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా
ఓనాడు కళకళ వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెల వెల బోతే ప్రాణమంత చినబోతుంది
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఓ ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
హే చేతి వృత్తులు నూరారు చేవకలిగిన పనివారు
హే హే చెమట బొట్టు తడిలోనే తళుక్కుమంటది ప్రతి ఊరు
ఎండపొద్దుకి వెలిగిపోతారు ఈ అందగాళ్ళు
వాన జల్లుకు మెరిసిపోతారూ
ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు
వీళ్ళందరిలాగే బాగ బతికే హక్కులు ఉన్నోళ్ళూ
పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని వట్టి జోల పాట పాడకా
తల్లడిల్లు తలరాతలకు సాయమేదొ చేయాలంట
వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ఓఓ
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
vachadayyo saami song lyrics
vachadayyo saami song lyrics in telugu
vachadayyo saami song lyrics in telugu from bharath ane nenu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment