chamkeela angileelesi song lyrics in telugu

చమ్కీలా అంగీ లేసి ఓ వదినే 
చాకు లెక్కుండేటోడే ఓ వదినే 
కండ్లకు ఐనా బెట్టి కత్తోలే కన్లెట్లా కొడుతుండెనే 
సినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కుసుంటాడే ఓ వదినే 
మాసిన లుంగీ ఏసి ఇప్పుడు మంచంలనే పంటాడే 

ఏ పెండ్లయినా కొత్తలా అత్థర్లు పూసిన్నే 
నీ చీర చెంగును పట్టి ఎనకేనకే తిరిగిన్నే 
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే 
చక్కర లెక్క నీ మాటలుంటుండే 
మారే నీ తీరు పెరిగే నీ నోరు మందుకలవాటైతినే

కడుపులా ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే 
అమ్వాస పున్నానికో అట్లట్లా అక్కర్కు పక్కకొత్తాడే 
చమ్కీలా అంగీలోడే
నాకు జుమ్కీలు అన్న తేడే 

వీడు వంటింట్లా నేనుంటే చాటుంగా వత్తుండే 
వంకర నడుము గిచ్చుతుండే 
నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే 
తైతక్క లాడకంటుండే 

కంట నీరన్న వెట్టకుండా సంటి బిడ్డ లెక్క నిన్ను 
అలుగుతుంటే బుధరగియ్యలేదా 
నువ్వు సీటికి మాటికీ గింతదాన్ని గంత జెసి 
ఇజ్జాతంతా బజారలేస్తలేవా 

ఏం గాలి సోకేనో వీన్ నెత్తి తిరిగెనో
పాతబడ్డనేమో చేతనైతలేదో 
ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేత్తడే 

చమ్కీలా అంగిలేసి ఓ వదినే 
చాకు లెక్కుండేటోడే ఓ వదినే 
కండ్లకు ఐనా బెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండెనే 

నోరిడిచి అడగదురా బామ్మర్ది 
చెప్పింది చెయ్యదురా బామ్మర్ది 
పక్కింట్లా కూసుంటది నా మీద చాడీలు చెప్తుంటది 
నా గొంతు గోసిండ్రంటూ బామ్మర్ది శోకాలు పెడుతుంటాది 
బామ్మర్ది ముచ్చట్లు చెప్పబోతే 
మీ అక్క మూతంతా తిప్పుతుంటది 

సీకట్ల ఉన్న వాకిట్ల ఉన్నా కంటికి రేప్పొలే కాస్తడు మొగడు 
ఎంత లొల్లాయినా నువ్వెంట ఉంటె ఎదురు నిలిచి వాడు గెలిసి వస్తాడు 
ఘోషల్ని చూస్తా ఉన్నా  ఏదైనా గుండెల్ల దాస్తాడులే 
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాన్ పంచ ప్రాణాలులే

Comments