- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా
ఓ ఓఓఓఓఓఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే బరువిక
ఓ ఓఓఓఓఓఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదే వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
enno raatrulosthayi gani song lyrics
enno raatrulosthayi gani song lyrics in telugu
kalyan ram enno raatrulosthayi gani song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment