vadadebaa | sun stroke first aid

 వడదెబ్బ తగిలిన వారికి ప్రథమ చికిత్స ఎలా  చేయాలో తెలుసుకుందాం.


  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి. చెట్టు  కిందకి కానీ, ఫ్యాను  కిందకి కానీ తీసుకు వెళ్ళాలి.
  • శరీరం మీద టైట్ గా ఉన్న దుస్తులను తీసేసి పల్చటి లేదా వదులుగా ఉన్న దుస్తులను వేయాలి.
  • ఈ దుస్తుల్ని  నీటిలో తడపాలి . 
  • జ్వరం ప్రతి 5 నిమిషాలకి ఒకసారి చూడాలి.  జ్వరం 98 డిగ్రీలకు తగ్గకుండా, 100 డిగ్రీలకి పెరగకుండా జాగ్రత్తపడాలి. 
  • వడదెబ్బ తగిలిన వారికి  10 నిమిషాలకు ఒకసారి ద్రవ పదార్థాలు అంటే పండ్ల  ,చక్కర ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు , బార్లీ, గంజి  తాగించాలి. 
  • ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. 

ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • పసిపిల్లలను, వృద్దులను, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారిని ఎండలో తిరగనీయరాదు .
  • నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. 
  • పలుచని మరియు వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి 
  • ఏవైనా బయట పనులు ఉంటె ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలి. 
  • తప్పని సరి అయ్యి బయటకి వెళ్ళవలసి వస్తే నీళ్ల సీసా, గొడుగు వెంటపెట్టుకుని వెళ్ళాలి. 
  • ఎండాకాలం నూలు దుస్తులు ధరిస్తే మంచిది. 
  • వీలయితే ప్రయాణాలు చేయకపోవడం మంచిది. 


Comments